గీతం విద్యార్థుల దుస్తుల వితరణ
సంగారెడ్డి:
దుస్తులను విరాళంగా ఇవ్వడం ద్వారా ఈ దీపావళిని అర్థవంతంగా మారుద్దామని హైదరాబాదు, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ఇచ్చిన పిలుపుమేరకు పలువురు విద్యార్థుల తమ వితరణ శీలతను చాటారు. వస్త్రనోవా, చరైవేతి విద్యార్థి క్లబ్ ల సహకారంతో, ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. తమ దుస్తులను – చొక్కాలు, జాకెట్లు, వస్త్రాలను విద్యార్థులు తీసుకొచ్చి నిర్వాహకులకు అందజేశారు. ఇలా సేకరించిన దుస్తులను హైదరాబాదులోని హైదర్షాకోట్లలో ఉన్న గూంజ్ అనే స్వచ్ఛంద సంస్థకు గీతం విద్యార్థులు అందజేయనున్నారు. ఇది ఒకరకంగా వనరుల పునర్వినియోగం ద్వారా నిరుపేద వర్గాలకు మద్దతు ఇచ్చేందుకు తోడ్పడుతుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. చరైవేతి అధ్యక్షురాలు తనీషా, ఉపాధ్యక్షుడు విశాల్ భరద్వాజ్, ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంతో పాటు, తమ తోటి విద్యార్థులను సహకరించేలా ప్రేరేపించడంలో చురుకైన పాత్ర పోషించారు.