ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సవాల్..  
- ఇది మోసం చేసే ప్రయత్నమే అంటున్న విపక్షాలు.. 
- న్యాయపరంగా ఎన్నెన్నో పరిమితులున్నాయి.. 
- రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్న ముఖ్యమంత్రి నిర్ణయం.. 
- వివిధ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న మేధావులు.. 
- సుప్రీంకి వెళ్లినా ఎలాంటి లాభం లేదంటున్న జేడీ.. 
- పాత పద్దతిలో ఎన్నికలు జరపడమే మేలంటున్న విశ్లేషకులు.. 
- ఎక్కువ జాప్యం చేస్తే గ్రామాలు కుంటుపడతాయని హెచ్చరిక.. 
- కోర్టులో విఫలం అయితే.. కాంగ్రెస్ పార్టీ తరఫున రిజర్వేషన్ ఇవ్వొచ్చని అంచనా.. 
- ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలు బీసీ సంఘాలు.. 
- కేవలం రాజకీయ ఎత్తుగడతో ముందుకు సాగడం దారుణమంటున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

hq720

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సరికొత్త డ్రామా నడుస్తోంది.. రాజకీయ స్వప్రయోజనాలకు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది..  రాష్ట్రవ్యాప్తంగా అధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గాన్ని బుట్టలో వేయడానికి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నాడని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు..  అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించి సంచలనానికి నాంది పలికి, బీసీ వర్గాల్లో మంచిపేరు సంపాదించుకున్నాడు అనుకునేలోపే..  తన అనుయాయులతో హైకోర్టులో పిటిషన్ వేయించి స్టే వచ్చేలా చేయడం.. స్థానికి ఎన్నికల ప్రక్రియను వాయిదా పడేలా రేవంత్ రెడ్డి పెద్ద డ్రామా ఆడాడని విశ్లేషకులు అంటున్నారు.. హైకోర్టు ఆదేశాలు రాగానే రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతాం  ఎలాగైనా సాధిస్తాం అని చెప్పడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, బీసీ సామజిక వర్గాల్లో పెను దుమారం రేగింది..  భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. సుప్రీం కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఫలితం ఉండదని తెలిసినా.. తన డ్రామాను  ముఖ్యమంత్రి కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎలాగైనా కాలయాపన చేయాలన్నదే ధ్యేయంగా కనిపిస్తోంది..  దీంతో గ్రామాల అభివృద్ధి కుంటుబడే ప్రమాదం ఉంటుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు..  

Read More తెలంగాణ రైజింగ్ విజన్ -2047 సర్వేలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొనాలి

తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రజలు, న్యాయవేత్తలు, సామాజిక వర్గాలు ఈ విషయాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే  దీని వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా?

Read More బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..

న్యాయపరమైన సవాళ్లు :

Read More నేటి ప్రజావాణి రద్దు

1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఇండ్రా సావ్నే తీర్పు ప్రకారం, రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటరాదన్నది నిర్విదాంశం..  ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు ఆ పరిమితికి దగ్గరగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో, మరింత పెంపు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడం సాధ్యపడే విషయం కాదు.. కాగా మహారాష్ట్రలో మారాఠా రిజర్వేషన్, తమిళనాడులో వన్నియార్ రిజర్వేషన్ కూడా ఇలాంటి కారణాలతో సుప్రీంకోర్టులో నిలవలేదు.
అందువల్ల తెలంగాణ సవాలు న్యాయపరంగా కఠినమైనదే.

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

రాజకీయ వ్యూహం : 

Read More జిల్లా రిజిస్ట్రార్‌ గా శగుఫ్తా ఫిర్దోస్

బీసీ వర్గాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారి ఓట్లు ఏ పార్టీ గెలిచినా, ఓడినా నిర్ణయించే స్థాయిలో ఉంటాయి.
అందుకే ప్రతి పార్టీ బీసీలను ఆకర్షించడానికి పోటీ పడుతుంది. సుప్రీంకోర్టుకెళ్లే ప్రకటనతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “బీసీల కోసం పోరాడుతున్నాం” అనే ప్రజా భావనను బలంగా వినిపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఒకవేళ తీర్పు ఆలస్యం అయినా, మధ్యలో “మేము ప్రయత్నం చేస్తున్నాం” అనే రాజకీయ లాభం మాత్రం దక్కుతుంది అన్నది పెద్ద ప్లానుగా తెలిసిపోతుంది.. ఇది స్పష్టంగా రాజకీయ పరంగా లాభదాయకమైన పావుగా చెప్పుకోవచ్చు.. 

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

సామాజిక ప్రభావం :

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

బీసీ వర్గాలు రిజర్వేషన్ పెంపును తమ హక్కుగా చూస్తున్నాయి. కానీ కోర్టు తుది తీర్పు ప్రతికూలంగా వస్తే, నిరాశ, నిరుత్సాహం, నిరసనలు వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. మరోవైపు, ఇతర వర్గాలు తమ వాటా తగ్గిపోతుందనే భయంతో ఆందోళన చెందవచ్చు. ఈ విధంగా, రాజకీయ నిర్ణయం సామాజిక సమతుల్యతకు పరీక్షగా మారవచ్చు.

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

అసలు పరిష్కారం ఎక్కడుంది? :

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

రాజ్యాంగ పరిమితులు మారకపోతే, రాష్ట్రాలు రిజర్వేషన్లను పెంచడం అసాధ్యం. కాబట్టి నిజమైన పరిష్కారం కేంద్ర స్థాయిలో రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుంది. అది లేకుండా, ఏ రాష్ట్రం చేసిన ప్రయత్నం కూడా తాత్కాలిక ప్రచార పద్దతి మాత్రమే అవుతుంది.
అయితే బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సీఎం సుప్రీంకోర్టుకు వెళ్తానన్న మాట ప్రజలకు ఆశను ఇచ్చినా, ఫలితం అనిశ్చితమే. ఇది రాజకీయంగా బలమైన సంకేతం అయినా, న్యాయపరంగా తాత్కాలిక ప్రయత్నం మాత్రమే. ప్రజల సంక్షేమం కోరుకునే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేస్తూ రాజ్యాంగ మార్పుల దిశగా అడుగులు వేస్తేనే నిజమైన న్యాయం జరుగుతుంది.

Read More అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి..

సుప్రీంకు వెళ్లినా లాభం లేదు : జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడంతో, ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరనుంది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి, ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన తరుణంలో ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని ప్రభుత్వం తన పిటిషన్‌లో బలంగా వాదించనుంది.

ఇదే అంశంపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ స్పందించారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటితే దేశంలో ఏ న్యాయస్థానమైనా అడ్డుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అతిక్రమిస్తే సమస్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ప్రభుత్వం ఈ జీవోపై సుప్రీంకోర్టుకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అనవసరమైన జాప్యం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి, పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వానికి శ్రేయస్కరమని లక్ష్మీనారాయణ సూచించారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయనుంది.. కేవలం ప్రజల దృష్టి మరల్చి  కాలయాపన చేయడమే విధిగా పెట్టుకున్నట్టు అర్ధం అవుతోంది.. 

About The Author