నేటి భారతం :
రాజకీయాల అవినీతితో గ్రామాలు ఆవేదనతో తల్లడిల్లుతున్నాయి..
పాలన బ్రష్టుపడితే, పల్లె పతనమవుతుంది.
రాజకీయ నేతల దాహం తీర్చడానికి, గ్రామాల దారిద్య్రం పెరుగుతోంది.
పల్లెలో ప్రజల నమ్మకం చచ్చింది, రాజకీయాల్లో నాటకం బ్రతికింది.
గ్రామం రోడ్డు కోసం ఎదురుచూస్తుంటే, నేత బంగ్లా కోసం పోరాడుతున్నాడు.
రాజకీయాలు శుద్ధి అయితేనే, పల్లెలు పునీతమవుతాయి.
అధికారంలో మునిగిన నేతలు, అభివృద్ధిని మరిచిపోయారు.
గ్రామం కోసం ఇచ్చిన హామీలు, అధికారం అందినవెంటనే మాయమైపోతాయి..
రాజకీయ నాయకుల ఆశలు ఆకాశమంత, గ్రామాల ఆశలు నీడంత.
పల్లె మనసు పసిడి, కానీ రాజకీయాలు దానిని బూడిదగా మార్చేశాయి.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటకు అర్ధమే మారిపోయింది..
About The Author
18 Oct 2025