అవినీతిని తమ ఇంటిపేరుగా మార్చుకుంటున్న అధికారులు..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

- భారీ అవినీతికి పాల్పడుతున్న మున్సిపల్ కమిషనర్లు...
- ప్రభుత్వ భూముల్లో, వ్యవసాయ భూముల్లో అనుమతులు ఇస్తాం మాకు చట్టాలు వర్తించవు...
- టౌన్ ప్లానింగ్ అధికారులతో, టాక్స్ అధికారులతో, చేతులు కలిపి లక్షల కోట్లు  కొల్లగొడుతున్న వైనం.. 
- ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులే దీనికి సాక్ష్యం..
- కేవలం సస్పెండ్ చేయకుండా, విధులనుంచి తొలగించాలి.. 
- శాఖాపరమైన కఠిన శిక్షలు అమలు చేయాలి.. 
- సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...
- డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " 

 

download (1)

Read More పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

వినడానికి, చెప్పుకోవడానికి కొన్ని అధికారుల పేర్లు, హోదాలు ఇన్స్పిరేషన్ గా ఉంటాయి.. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రమే చాలా ఛండాలంగా ఉంటాయి..  ఎం.ఏ. అండ్. యు.డి, డి.టి.సి.పి మున్సిపల్ శాఖ కమిషనర్ టి. శ్రీదేవి ఐఏఎస్ , బిల్ నౌ ఇన్చార్జ్ టౌన్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ల అవినీతిపై దృష్టి సారించ లేకపోతున్నారా..? లేక ఎందుకులే అని మిన్నకుండిపోతున్నారా..? అసలు ఇందులోని అంతర్యం ఏమిటో మరి..! అవినీతి మున్సిపల్ కమిషనర్లను ట్రాన్స్ఫర్లు చేయడం కాదు విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు పెట్టరెందుకు...? దీనికి కూడా సమాధానం లేదు.. 

Read More బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..

డి.పి.ఎం.ఎస్ బాగుండే...టీఎస్ బి పాస్ పోయింది టీజీబిపాస్ వచ్చింది, టీజీబిపాస్ పోయింది బిల్డ్ నౌ వచ్చింది..  ఏది వస్తే మాకేంటి..?  ఉయ్ డోంట్ కేర్.. మా అవినీతికి ఎదురే లేదు అంటున్నారు  అవినీతి అధికారులు.. వీటికి సంబంధించి ప్రభుత్వ వెబ్సైట్లో పారదర్శకత లేకపోవడం.. ఉన్నత స్థాయి అవినీతి అధికారులు కావాలనే పారదర్శకత లేకుండా చేసి, అవినీతికి పాల్పడుతున్న అధికారులను కంట్రోల్ లోకి తీసుకొని, వారి అవినీతిలో కొంత అవినీతి సొమ్మును తీసుకొని పారదర్శకత లేకుండా ఉన్నతస్థాయి  ప్రిన్సిపల్ సెక్రెటరీ, మున్సిపల్ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇటు ప్రభుత్వాన్ని అటు ప్రజలను మోసం చేస్తున్నారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి..
 
బిల్డ్ నౌ లో పారదర్శకత జీరో.. టౌన్ ప్లానింగ్ అధికారి  ఏమి చేసినా చెల్లుతుంది, ఎంత అడిగినా ఇవ్వవలసిందే అడిగి నాథుడే లేడు..  తప్పులు కనబడే పరిస్థితి లేదు..  ఈ విషయంపై బిల్ నౌ టీం అధిపతి దేవేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి.. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి...బంగారు తెలంగాణలో జవాబుదారీతనం లేకపోవడం, పారదర్శకత లేకపోవడం అవినీతికి అద్దం పడుతుందనే విషయాన్ని పాలకులు మర్చిపోవద్దని  రాజకీయ నిపుణులు తమ నిస్పృహను వెళ్లబుచ్చుతున్నారు.. 

Read More అధిష్టానం నిర్ణయమే ఫైనల్..

ఇలాంటి మొనోపాలి పరిపాలన జరిపిన గత సీఎం కేసీఆర్  ప్రజా క్షేత్రంలో ఓటమిపాలైన పరిస్థితులు రేపు మీకు ఎదురవుతావునే విషయాన్ని మర్చిపోవద్దు... ప్రతి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ముఖ్య భూమిక పోషించే మున్సిపల్ శాఖ పలు పలు ప్రాంతాలలో మున్సిపాలిటీలుగా గ్రామపంచాయతీలుగా విభజించబడి, పరిపాలనకు అనుగుణంగా మున్సిపల్ శాఖ ద్వారా నియమించబడిన మున్సిపల్ అధికారులు పలు మున్సిపాలిటీలకు సంబంధించిన ఉన్నత స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు అవినీతే పరమావధిగా జీవనాన్ని సాగిస్తున్నారు అనడానికి ఈ వార్త కథనం నిదర్శనం... 

Read More జర్నలిస్టు వెంకటకృష్ణ మృతికి టి జె ఎఫ్ ఘన నివాళి

మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పలు పలు ప్రాంతాలలో వీరికి నియంత్రించబడ్డ ప్రాంతానికి వీరు జవాబుదారీగా ఉన్న స్థాయి అధికారి..  వీరికి ప్రభుత్వం కల్పించిన అధికారాలు ఉన్నతమైనవిగా చెప్పుకుంటే ఆ ప్రాంతానికి ప్రత్యేక అధికారులు ఈ మున్సిపల్ కమిషనర్ కు ఉంటాయి.. గృహ నిర్మాణానికి అనుమతులు పొందాలంటే మొదట టౌన్ ప్లానింగ్ అధికారి, తదుపరి మున్సిపల్ కమిషనర్ అప్రూవ్ చేయడంతో నిర్మాణ అనుమతులు జారీ అవుతాయి.. నిర్మాణ అనుమతులు ఇచ్చే అధికారం తిరస్కరించే అధికారం వీరికి ఉంటుంది... ఇదే అదునుగా చిన్నచిన్న తప్పులు ఉంటే భారీ ఎత్తున లంచాలు డిమాండ్ చేసి, లక్షల కోట్లు మూట కట్టారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి.. 

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

ఇదే విధంగా నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్డింగ్ ప్రాపర్టీ టాక్స్ వేసే అధికారం మున్సిపల్ కమిషనర్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ అధికారి అధీనంలో ఆర్వో ఏఎంసి పన్ను విధించే అధికారులు వారి కింద రెవెన్యూ  అధికారులు, హెల్పర్లు ఇతరత్రా కింది స్థాయి అధికారులు ఉంటారు .. వీరిని  నియంత్రించే అధికారం, ప్రోత్సహించే అధికారం మున్సిపల్ కమిషనర్ గా ఉంటుంది..  ఈ విభాగంలో కూడా భారీ ఎత్తున ముడుపులు తీసుకొని మున్సిపల్ కమిషనర్లు కోట్లకు పడగలెత్తారు.. అనడానికి ఎన్నెన్నో నిదర్శనాలున్నాయి.. ఏసీబీకి చిక్కిన అధికారులే సాక్ష్యం.. ఇదే కాకుండా రోడ్లు, ఇతరత్రా చెత్త నిర్వహణ, పారిశుధ్యం ఫేవరెట్ విధుల నిర్వహణ..  వీటిలో కూడా నాసిరకం పనులతో భారీ అవినీతి జరుగుతోంది.. హరితహారంలో కూడా కక్కుర్తి. ఈ అవినీతి అధికారులపై క్షేత్రస్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించలేకపోవడం, ఉన్నత స్థాయి అధికారుల వైఫల్యం, లేకపోతే అవినీతికి దాసోహమా..? ప్రభుత్వాలపై ప్రజలు తిరగబడే రోజులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత స్థాయి అధికారులదే అని నొక్కివక్కాణించి  చెబుతున్నారు రాజకీయ నిపుణులు..  

Read More బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

మున్సిపల్ కమిషనర్ల అవినీతి: స్వభావం : 

Read More కరీంనగర్ లో ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ పైనే

మునిసిపల్ కమిషనర్లు లేదా సంబంధిత అధికారులు అంటే డిప్యూటీ కమిషనర్లు, డిపార్ట్మెంటల్ అధికారి మొదలైన అవినీతికి పాల్పడుతున్నారు.. బడ్జెట్‌, ప్రాజెక్ట్ అనుమతుల, కాంట్రాక్టుల ఒప్పందాల నిఘా లేకుండా చేపట్టడం జరుగుతోంది.. అక్రమంగా భూమి అనుమతులు, నిర్మాణ అనుమతులు ఇవ్వడం చేస్తున్నారు.. ఇక లైసెన్సులు, వ్యాపార అనుమతులు కోసం తీసుకొనే రుసుములు, చెల్లింపులు.. జల సరఫరా, పారిశుద్ధ్య, చెత్త నిర్వహణలో అక్రమ విధులు.. ఇతర వస్తువులు, సరఫరా ఒప్పందాల్లో అదనపు ముడి ధరకే ఒప్పందాలు చేసుకోవడం జరుగుతోంది.. పెనాల్టీలు లేవనిచ్చడం, చెకింగ్ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉంచడం జరుగుతోంది.. ఈ విధంగా మునిసిపల్ కమిషనర్ల అవినీతి జరుగుతుంది.

Read More వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ఏమి చేస్తున్నాయి..? 

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

భారత కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పాలక సంఘాలు పలు చర్యలు చేపడుతున్నారు.. 

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

తీసుకుంటున్న చర్యలు : 

అవినీతిపై నిఘా ఉంచడానికి చట్ట సవరింపులు, అధికారులు అధిక బాధ్యత నిర్వహణ చేయడం.. ఉదాహరణకు, మండల అధికారులకు, ఐఏఎస్  అధికారులకు మాత్రమే పెద్ద మున్సిపల్‌ కమిషనర్ పదవులు ఇవ్వాలని రాష్ట్రం నిర్ణయించడం 

ఇక రాష్ట్ర స్థాయి ఏసీబీ / విగిలెన్స్‌ శాఖల బలపరిచుట.. రాష్ట్ర లేదా నగర స్థాయిలో ఏసీబీ లేదా విచారణ విభాగాలు..
ఉదాహరణ : థానే మునిసిపల్ కమిషనర్ సహాయకుడు బ్రైబ్ కేస్‌లో అరెస్ట్ అయింది.. 

సెంట్రల్ ఏజెన్సీలు అంటే సీబీఐ, ఈడీలు.. భారీ అక్రమాల, మనీ లాండరింగ్, ఆస్తి విచారణలు చేపడతాయి.. పారదర్శకత, డిజిటైజేషన్ అండ్  ఆన్‌లైన్ సిస్టమ్స్.. అనుమతులు, లైసెన్స్, ఫీజు చెల్లింపులు వంటి ప్రక్రియలను ఆన్‌లైన్‌లో నిర్వహించడం ద్వారా ప్రత్యక్షంగా మధ్యవర్తి తొలగింపు.. ప్రభుత్వాలు డిజిటల్ పోర్టల్స్, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులు ప్రచారం చేస్తున్నాయి 

ఇక ఫిర్యాదుల యంత్రాంగం :    
అవినీతిపై ఫిర్యాదులను ప్రోత్సహించేందుకు సురక్షిత మార్గాలు వున్నాయి.. విషిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ : 2011 ద్వారా ఫిర్యాదిదారులకు రక్షణ కల్పించే చట్టం ఉంది 

న్యాయవాదులు / న్యాయపరిశీలనలు / హై కోర్టు ఆదేశాలు :    
న్యాయసహాయం, ప్రమాణపత్రాల సమీక్ష, విచారణ ఆదేశాలు    తదితరాలు.. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లో హరిద్వార్ భూమి స్కాంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులను గుర్తించి విచారణ కోసం ఆదేశం ఇచ్చారు.. 

అడిట్ అండ్  ఆడిట్ నివేదికలు :    
ఆర్థిక లెక్కలు, ఖర్చు విశ్లేషణలు, గణాంకాల సమీక్షల ద్వారా కేంద్ర, రాష్ట్ర, నగర స్థాయి ఆడిట్ సంస్థలు పనిచేస్తాయి.. 
ప్రజా పర్యవేక్షణ,  ఆరోపణలు,    న్యాయపూర్వక పిటిషన్లు, ప్రజా పోరాటాలు, మీడియా మ్యాప్,స్థానిక సంస్థలు, ఎన్ .జీ.ఓ.లు, మీడియాలు  అవినీతిపై తమవంతు పోరాటం చేస్తున్నాయి.. 

అవినీతి పేరుకుపోవడంతో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. 

పొలిసీ అమలులో తేడాలు.. అవినీతి  కారణంగా ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు ఆలస్యం అవుతాయి..  అంతర్గత షెడ్యూల్ పక్కదారి పడుతుంది.. ఇక పబ్లిక్ నిధులను వివిధ అక్రమ మార్గాల్లో వృథా చేయడం, సరిగా వినియోగించకపోవడం జరుగుతోంది.. అవసరమైన ప్రాంతాల్లో సేవలు లభించకపోవడం జరుగుతోంది.. నీటి సరఫరా, పారిశుద్ధ్యం ఇలా అన్ని సేవలు బలహీనమవుతాయి.

వ్యవస్థలపై ప్రజల్లో  నమ్మకం తగ్గుముఖం పడుతుంది.. ప్రజలకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెరగడం, ప్రజాధారణలో సమస్యలు ఏర్పడతాయి.. అదేవిధంగా సమాజంలో అవినీతికి ప్రోత్సాహం లభించే ప్రమాదం ఏర్పడుతుంది.. అసమానత, అభివృద్ధిలో లోపాలు ఏర్పడతాయి.. దీంతో నిరుపేదలు.. సామాన్యులు తమకు అందవలసిన సమాన హక్కులు కోల్పోతారు.. ప్రభుత్వాన్ని, సంస్థలను న్యాయవాదులు, పిటిషన్లు ఎదుర్కోవడం, అధిక ఖర్చులు ఎదురవుతాయి.. 

తెలంగాణలో జరిగిన కొన్ని అవినీతి ఘటనలు చూద్దాం :  

హుజూర్ నగర్ లో రూ. 7.2 లక్షల నిధుల దుర్వినియోగం జరిగింది.. పట్టణ  ప్రగతి  పథకంలో అసలు పని చేయకుండా ఫేక్ బిల్స్ వేసి రికార్డులు మారుస్తూ, నగర కమిషనర్, ఇద్దరు ఇంజినీర్లు కలిసి నిధులను స్వాహా చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.. 

ఇక ధర్మపురి మునిసిపల్ కమిషనర్ కందుల శ్రీనివాస్ ఇంజినీరింగ్ వైద భత్య కార్మికుడికి జీతం విడుదల చేయడంలో రూ. 20,000 లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. 

జనగామ మునిసిపల్ కమిషనర్, జంపాల రజిత రూ. 40,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారు ట్రాప్ చేశారు..  

పెబ్బేరు మునిసిపల్ కమిషనర్ అరెస్ట్ అవడం అప్పట్లో సంచలనం సృష్టించింది.. మునిసిపల్ కమిషనర్ కందికట్ల ఆదిశేషు రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.. 

నార్సింగి మునిసిపల్ పరిధిలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మణి హారిక రూ. 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు.. 

ఇక రాజేంద్ర నగర్ పరిధిలో జీ.హెచ్.ఎం.సి. డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఏసీబీ పరిధిలో కేసులో ఉన్నట్లు తెలుస్తోంది.. 

గద్దపోతారం, సంగారెడ్డి జిల్లాలో మునిసిపల్ అధికారులు అనుమతి లేకుండా కొన్ని ఇళ్ళను ధ్వంసం చేయబోతున్నారని, 13 కుటుంబాలు హైకోర్టు ముందు ప్రస్తావించారు.. దీంతో హైకోర్టు ఆ ప్రక్రియను ఆపుతూ ఆదేశాలు జారీ చేసింది.. 

ఇక ముఖ్యంగా బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ పై, అవినీతి కార్యకలాపాలపై హై కోర్టు దృష్టి పెట్టిన సంగతి విదితమే.. బడంగ్ పేట్ నగర సంస్థ విధులలో అనధికార నిర్మాణాలు, పబ్లిక్ రోడ్లను ఆక్రమించడం లాంటి ఆరోపణలపై తక్షణ చర్యల్లో పాలుపంచుకోమని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది.. . 

ఈ విధంగా అనేక కేసుల్లో ఏసీబీ వెంటనే విచారణ చేపట్టి, అరెస్టులు చేస్తోంది.. మునిసిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటోంది.. .ఉదాహరణకు జంపాల రాజిత, జనగాం.. హుజూర్నగర్ కమిషనర్ కేసులను చెప్పుకోవచ్చు.. 

హైకోర్టు జడ్జిమెంట్లు, ఆదేశాలు :
హైకోర్టు మునిసిపల్ సంస్థలపై నియంత్రణ విధిస్తూ అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టమని ఆదేశాలు ఇచ్చింది..  అలాగే గుర్తింపు లేకుండా ఇళ్ళ ధ్వంసం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.. 

లోకాయుక్త :
తెలంగాణలో లోకాయుక్త ప్రజల  ఫిర్యాదులను స్వతహాగా విచారించగల ఒక సంస్థగా ఉంది. 

ఇన్ని జరుగుతున్నా మున్సిపల్ కమిషనరు కానీ, ఇతర అధికారులు కానీ అవినీతి చేయడానికి వెనుకాడటం లేదు.. ఎందుకిలా జరుగుతోంది.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కేవలం అదుపులోకి తీసుకుని, సస్పెన్షన్ విధించడం జరుగుతోంది.. దీంతో కొద్దీ కాలం తరువాత తిరిగి విధుల్లో చేరడం.. అవినీతి కార్యకలాపాలు చేయడం జరుగుతోంది.. తాము పట్టుబడ్డప్పుడు, కోర్టులకు వెళ్లడం, సస్పెన్షన్ ని ఎత్తివేయించుకోవడం జరుగుతోంది.. అలా కాకుండా ఎవరైతే అవినీతిలో దొరికిపోతారో అలాంటి వారిని పూర్తిగా విధులనుంచి తొలగించి.. కఠిన శిక్షలు అమలు చేస్తే మరొకరు అవినీతి చేయడానికి జంకుతారని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

About The Author