నేటి భారతం :

చెత్త మనుషులని పిలుస్తాం.. కానీ వారివి మంచి మనసులు.. 
మట్టి, చెత్తలో పని చేసినా.. మన నగరాన్ని 
శుభ్రంగా ఉంచేది వారి హృదయ స్వచ్ఛతే.. 
వీధి మీద చెత్త తొలగించే చేతులు, 
మన సమాజాన్ని పరిశుభ్రతతో నింపుతున్న దేవుళ్ల చేతులు.. 
పారిశుధ్య కార్మికుడు ప్రతి ఉదయం 
మన నగరానికి కొత్త శ్వాస ఇస్తాడు... 
చెత్తను తాకుతూ ఉన్నా, మన జీవనంలో 
శుభ్రతను నిలబెట్టే నిజమైన యోధుడు పారిశుధ్య కార్మికుడు.. 
వారు చేసే పని చిన్నది కాదు..  
మన నగర ఆరోగ్యానికి ఆధారం అదే.. 
వైద్యుడు రోగిని రక్షిస్తాడు, కానీ పారిశుధ్య కార్మికుడు 
రోగం రాకుండా కాపాడుతాడు.. 
వారిని తక్కువగా చూడొద్దు..  
వారు మన సమాజానికి కనిపించని రక్షకులు.. 
మన నగరం పరిశుభ్రమని గర్వపడే ముందు, 
ఆ గర్వానికి మూలమైన వారి కష్టం గుర్తు పెట్టుకో.. 
వారి చెమట చుక్కలే మన నగర స్వచ్ఛతకు పునాది.. 
వారి పనిని ‘చెత్త పని’ అని కాదు, ‘మహత్తర సేవ’ అని పిలవాలి.. 

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

WhatsApp Image 2025-10-13 at 5.07.49 PM

Read More పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

- బోయినపల్లి రమణా రావు, సీనియర్ జర్నలిస్ట్..

Read More నేటి భారతం :

About The Author