పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి  

ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : 

WhatsApp Image 2025-10-12 at 6.47.43 PM

భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర సత్యనారాయణ రావు  భూపాలపల్లి నియోజక వర్గం శాయంపేట మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపునిచ్చారు.

Read More పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

ఎమ్మెల్యే  గండ్ర  సత్యనారాయణ మాట్లాడుతూ, “పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత. ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

Read More స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం

About The Author