బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
దీపావళి సందర్భంగా భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి :: నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల.
ప్రజల భద్రత, క్షేమం దృష్టిలో ఉంచుకొని రాబోయే దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, సూచించారు. బాణాసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలను ఏర్పాటు చేసినా, సరైన భద్రతా ప్రమాణాలు లేకుండా విక్రయాలు జరిపినా, ప్రేలుడు పదార్థాల చట్టం (Explosives Act) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దుకాణాల మధ్య కనీస దూరం పాటించాలి... అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలి... విద్యుత్ లైన్ల దగ్గర బాణాసంచా నిల్వ చేయరాదు... మైనర్లు (చిన్నపిల్లలు) విక్రయంలో పాల్గొనరాదు. ప్రజలందరూ చట్టాలు, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డా. జి. జానకి షర్మిల కోరారు..