స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
సంగారెడ్డి :
- ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సిద్ధంగా ఉండాలని సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే ను కలసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కైవసం చేసుకోవాలని సూచించారు.స్థానిక సంస్థలు నిర్వహించడంలో ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్ రేవంత్ ఫార్ములా ఇదే అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కంది మండల పార్టీ నేతలు ఉన్నారు.
About The Author
18 Oct 2025