నేటి ప్రజావాణి రద్దు
జిల్లా కలెక్టర్
ములుగు జిల్లా ప్రతినిధి :
జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఎస్ ఎస్ తాడ్వాయి మండలం లోని మేడారం లో శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 ఏర్పాట్ల పై ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున, ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే సోమవారం యథావిధిగా జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో వెల్లడించారు.
Read More వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?
About The Author
18 Oct 2025