డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-14 at 7.04.58 PM

అనుభవపూర్వక అభ్యాసం, పరిశ్రమ సందర్శన కార్యక్రమాలలో భాగంగా, హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ (జీఎస్ పీ) ఎం.ఫార్మా, పరిశోధక విద్యార్థులు ప్రముఖ పరిశోధన ఆధారిత ఔషధ సంస్థ డైసెల్ లాబొరేటరీస్ ను సందర్శించారు.డైసెల్ చిరల్ టెక్నాలజీస్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తల్లూరి గీతం విద్యార్థులను స్వాగతించగా, అధ్యాపకులు డాక్టర్ గటాడి శ్రీకాంత్, డాక్టర్ ప్రియా సింగ్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ సందర్శనలో భాగంగా, విద్యార్థులు క్రోమాటోగ్రఫీ, స్పెక్ట్రోస్కోపీ, సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ క్రోమాటోగ్రఫీ యూనిట్లతో సహా వివిధ విశ్లేషణాత్మక విభాగాలను పర్యటించారు. పరిశ్రమ నిపుణులు వారికి డేటా సమగ్రత, సిస్టమ్ అనుకూలత, నాణ్యత నిర్వహణ వ్యవస్థల గురించి వివరించారు. పారిశ్రామిక ప్రమాణాలు, ఉత్తమ పద్ధుతులపై వారికి అవగాహన కల్పించారు. విశ్లేషణాత్మక పద్ధతి అభివృద్ధి, ధ్రువీకరణ, నాణ్యత నియంత్రణ, నియంత్రణలపై విద్యార్థులు లోతైన అవగాహనను ఏర్పరచుకున్నారు.ఈ సందర్శన తరగతి గది అభ్యాసాన్ని వాస్తవ-ప్రపంచ అనువర్తనాలతో సమర్థవంతంగా అనుసంధానించడమే గాక గీతం యొక్క ఫలిత-ఆధారిత విద్య (ఓబీఈ) ఫ్రేమ్ వర్క్ తో అనుసంధానించి, పరిశ్రమ-విద్యా సహకారాన్ని బలోపేతం చేసింది. ఇంత మంచి పర్యటనను ఏర్పాటు చేసినందుకు స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, అధ్యాపకులు డాక్టర్ బి.దుర్గాప్రసాద్, డాక్టర్ పి.ప్రతీక్, డాక్టర్ సి.బప్పాదిత్య, డాక్టర్ గటాడి శ్రీకాంత్, డాక్టర్ ప్రియాసింగ్ లకు విద్యార్థులు కృతజ్జతలు తెలియజేశారు.

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

About The Author