నేటి భారతం :

download (1)

గురువు ఒక దీపం లాంటివాడు.. తాను కాలిపోయి, 
ఇతరుల జీవితాలను వెలిగిస్తాడు.
విద్యార్థుల భవిష్యత్తు గురువు చేతుల్లో ఉంటుంది.. 
ఆ చేతులు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి.. 
ఉపాధ్యాయుడు అనేది పుస్తకాలలోని జ్ఞానాన్ని 
మనసులలో నింపగల మాంత్రికుడు.
ఒక మంచి గురువు, వేల మందికి ప్రేరణగా నిలుస్తాడు.
గురువు ఇచ్చే పాఠం జీవితాంతం మనసులో 
నిలిచే శక్తి కలిగిఉంటుంది.

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

తల్లిదండ్రులు మనకు జీవితం ఇస్తారు..  
కానీ గురువు ఆ జీవితానికి దిశ చూపుతాడు.
ఒక మంచి ఉపాధ్యాయుడు, విద్యార్థుల్లోని 
చీకట్లను తొలగించి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాడు.
గురువు మాటే విద్యార్థి మనసులో మార్పుకు 
మొదటి మెట్టుగా మారుతుంది.
పుస్తకాలకంటే గొప్ప పాఠం గురువు ప్రవర్తనలో ఉంటుంది.
గురువు ప్రేమ, శ్రద్ధ, మార్గదర్శకత..  
ఇవే విద్యార్థి జీవితానికి బాటలు వేస్తాయి.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

- కేసారం పెంటారెడ్డి, సీనియర్ సామాజిక విశ్లేషకులు..

Read More ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

About The Author