పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తూ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి పొంది ఖమ్మం కమిషనరేట్ కు కేటాయించబడిన పోలీస్ అధికారులు సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం పాల్గొన్నారు.