రాష్ట్ర స్థాయికి ఎంపికైన రాధిక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి
మణుగూరు :
మణుగూరు బ్రాంచ్ కి చెందిన రాధిక కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికవ్వడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న 69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ (ఎస్.జి.ఎఫ్) పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడల్లో భాగంగా షాట్ పుట్ అండర్ 14 విభాగంలో పి సంపత్ కుమార్ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక అయ్యాడు. పాఠశాల చైర్మన్ గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో జరగబోయే క్రీడల్లో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడల వలన మానసిక ఉల్లాసంతో పాటు క్రమశిక్షణ మెరుగుపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. డైరెక్టర్లు జయసింహా రెడ్డి, సంపత్ రెడ్డి, బద్ధం శ్రీనివాసరెడ్డి, నూకారపు రమేష్ ప్రధానోపాధ్యాయులు నరేష్, కోఆర్డినేటర్లు ఉష, కీర్తి పిఈటి నరేందర్, చంద్రకళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని శుక్రవారం స్కూల్లో ప్రత్యేకంగా అభినందించారు.