రసాయన శాస్త్రంలో కె.వి. గిరిజకు పీహెచ్ డీ

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-10 at 5.52.48 PM

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని కె.వి. గిరిజ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ఫోటోల్యూమినిసెన్స్ అధ్యయనాలు, జీవసంబంధ కార్యకలాపాల కోసం అరుదైన భూమి డోప్డ్ నానోఫాస్పర్ పదార్థాల హైడ్రోథర్మల్ సంశ్లేషణ, లక్షణంపై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీ.వీ. నాగేంద్ర కుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకాశించే నానోమెటీరియల్స్ రంగానికి గణనీయంగా తోడ్పడుతుందని, వాటి ఆప్టికల్, బయోమెడికల్, చికిత్సా పద్ధతులను కూడా ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలిపారు.హైడ్రోథర్మల్, సాల్వోథర్మల్ సంశ్లేషణ పద్ధతులను ఉపయోగించి, డాక్టర్ గిరిజ Ho³⁺, Nd³⁺, Yb³⁺, and Ce³⁺ doped GdPO₄, LaPO₄, and GdVO₄ వంటి పదార్థాలను అన్వేషించినట్టు ఆయన పేర్కొన్నారు. వాటి స్పటిక నిర్మాణం, కాంతి ప్రవర్తన, క్యాన్సర్ నిరోధక, బాక్టీరియా నిరోధక, శిలీంధ్ర నిరోధక కార్యకలాపాలతో సహా జీవ లక్షణాలను అంచనా వేసినట్టు తెలిపారు. ఆమె పరిశోధనలు స్టెఫిలోకాకస్, ఈ.కోలి, కాండిడా వంటి సాధారణ వ్యాధికారకాలకు వ్యతిరేకంగా బలమైన కాంతి పనితీరును, గుర్తించదగిన నిరోధక ప్రభావాలను వెల్లడించాయన్నారు.బయో-ఇమేజింగ్, వైద్యంలో వినియోగానికి పదార్థాల సామర్థ్యాన్ని నొక్కి చెబుతోందని తెలియజేశారు.ఆమె పరిశోధనా పత్రాలను స్కోపస్-ఇండెక్స్డ్ జర్నల్స్ లో ప్రచురించడం, ఆమె పనితీరుతో పాటు గీతం యొక్క వినూత్న, ప్రభావవంతమైన శాస్త్రీయ పరిశోధనకు నిబద్ధతగా నిలుస్తోందన్నారు.డాక్టర్ గిరిజ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

Read More బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..

About The Author