నేటి భారతం
అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటం కాదు..
చేతి నిండా పని, కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర..
కష్ట సుఖాలను పంచుకునే సన్నిహితులుండటమే..
అందుకే జీవితంలో ఎవరినీ దూరం చేసుకోకు..
శత్రుత్వం అసలు పెంచుకోకు..
చిరునవ్వు ఆభరణంగా, మంచితనాన్ని కప్పుకుని..
మనిషిగా జీవించు.. ఒక్కటి గుర్తుపెట్టుకో..
ఒకే ఒక్క రోజు బ్రతికే పువ్వే తల ఊపుతూ
విరబూసి నవ్వుతూ ఉంటుంది..
నూరేళ్ళు బ్రతికే మనం చిరునవ్వుతో బ్రతకలేమా ?
బ్రతికేద్దాం నేస్తం.. మనకు ఉన్నది ఒక్కటే జీవితం..
మరుజన్మ ఉన్నదో లేదో..? ఈ జన్మలోనే
చరితార్ధులుగా మిగిలిపోదాం..
Read More నేటి భారతం