గ్రంథాలయ చైర్మన్ కు పాఠకులు సన్మానం
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 22 (భారత శక్తి) : జిల్లా కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా గ్రంథాలయం అభివృద్ధికి నోచుకోక అవస్థలు పడుతున్న మహిళ పాఠకులకు టాయిలెట్స్ తో పాటు నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మించి గొప్ప మనస్సు చాటుకున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ను ములుగు జిల్లా గ్రంథాలయ మహిళా పాఠకులు, సిబ్బంది శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వస్తున్న వారికి వివిధ కాంపిటీషన్ పరీక్షల కోసం జిల్లా గ్రంథాలయ కేంద్రంలో పురుషులకు,మహిళలకు ప్రత్యేకంగా ఆధునిక పద్ధతిలో మరుగుదొడ్లు నిర్మించినందుకు ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ కు, సహకరించిన మంత్రి సీతక్క,జిల్లా కలెక్టర్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
About The Author
03 Aug 2025