ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం,స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్ల ను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల  స్వీకరణ ప్రారంభం,స్వీకరించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం సోమవారం ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఆరుగురు, టీచర్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు గ్రాడ్యుయేట్, టీచర్స్ స్థానానికి రెండిట్లో నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 12 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్ల ను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.

About The Author