ముత్యంపేట ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేసిన కారకులపై చర్యలు తీసుకోవాలి : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జనవరి 31: కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని చెందిన ప్రాథమిక పాఠశాల ప్రహరి గోడ ను ఈ నెల 29 వ తేది రాత్రి ముత్యంపేట మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్, అతని అనుచరులు డిసిఎమ్ తో ఉద్దేశ పూర్వకంగా గుద్దడం వల్ల ప్రహరి గోడ కూలిపోయిందని , వారిపై చర్యలు తీసుకోవాలని మత్యంపేట గ్రామ ప్రజలు ఈ రోజు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జిల్లా ఎస్పికి పోన్ చేసి ముత్యంపేట్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పి కి సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎవరైన ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ, ప్రజల ఆస్తుల విషయంలో కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు.

ముత్యంపేట ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేసిన కారకులపై చర్యలు తీసుకోవాలి : కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, జనవరి 31: కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని చెందిన ప్రాథమిక పాఠశాల ప్రహరి గోడ ను ఈ నెల 29 వ తేది రాత్రి ముత్యంపేట మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్, అతని అనుచరులు డిసిఎమ్ తో ఉద్దేశ పూర్వకంగా గుద్దడం వల్ల ప్రహరి గోడ కూలిపోయిందని , వారిపై చర్యలు తీసుకోవాలని మత్యంపేట గ్రామ ప్రజలు ఈ రోజు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డికి కామారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి జిల్లా ఎస్పికి పోన్ చేసి ముత్యంపేట్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పి కి సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా, ఎవరైన ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ, ప్రజల ఆస్తుల విషయంలో కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు.

About The Author