తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ పై చర్యలు తీసుకోవాలి: కరీంనగర్ అడిషనల్ డిసిపి కి రెడ్డి సంఘాల పిర్యాదు
కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత శక్తి) పలు బహిరంగ సభల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ కావాలని రెడ్డీలపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నేతలు కరీంనగర్ అడిషనల్ డీసీపీ కి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ తో రెడ్డి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ బీసీ బహిరంగ సభల్లో మా రెడ్డిల బయటకు చెప్పారని పదాలతో నానా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు వాక్యాణిస్తున్నారని, వాటికన్నిటీ వీడియోల ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి డీసీపీ సానుకూలంగా స్పందించారని విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు చేపడుతామని తమకు హామీ ఇచ్చారని నాయకులు మీడియాకు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బయట రెడ్డి సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా రాజ్యాంగం ప్రకారమే జరిగిన ఎన్నికల్లో గెలిచి, మండలిలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని కులాలకు సమన్యాయం కలిపిస్తూ, అందరి సహకారంతో అభివృద్ధికి కృషిచేస్తానని చేసిన బాసలు ఏమైనాయని ఆరోపించారు. పలు బహిరంగ సభల్లో రెడ్డిల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూన్నమనీ చెప్పారు. నవీన్ వెంటనే ని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవినీ అడ్డుపెట్టుకొని రెడ్డిలపై మరోసారి ఇలాంటి వాఖ్యలు చేస్తే తెలంగాణ లో ఎక్కడ తిరుగనియ్యమని హెచ్చరించారు. నవీన్ నీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని, చాయకు పైసలు అడిగినోనివి ఈ రోజు వందల కోట్లు ఎలా సంపాదించావో బయటకు వస్తాయన్నారు. తీన్మార్ మల్లన్న మాయలో పడి బిసిలు మోసపోవద్దనీ రెడ్డి సంఘాల నాయకులు సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై వెంటనే చర్యలు చేపట్టి, పదవి నుంచి బర్తరఫ్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు…అలాగే వచ్చే రెండు రోజుల్లో మండలి చైర్మన్ ను కలిసి తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ పై పిర్యాదు చేస్తామని మండిపడ్డారు. రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రికులపెల్లి రవీందర్ రెడ్డి, ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి దారం జగన్నాథ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సామా బల్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, సాగర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జలపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు
కరీంనగర్, ఫిబ్రవరి 5(భారత శక్తి)
పలు బహిరంగ సభల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ కావాలని రెడ్డీలపై అనుచిత వాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బుధవారం తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నేతలు కరీంనగర్ అడిషనల్ డీసీపీ కి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ తో రెడ్డి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ బీసీ బహిరంగ సభల్లో మా రెడ్డిల బయటకు చెప్పారని పదాలతో నానా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు వాక్యాణిస్తున్నారని, వాటికన్నిటీ వీడియోల ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి డీసీపీ సానుకూలంగా స్పందించారని విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు చేపడుతామని తమకు హామీ ఇచ్చారని నాయకులు మీడియాకు తెలియజేశారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం బయట రెడ్డి సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా రాజ్యాంగం ప్రకారమే జరిగిన ఎన్నికల్లో గెలిచి, మండలిలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అన్ని కులాలకు సమన్యాయం కలిపిస్తూ, అందరి సహకారంతో అభివృద్ధికి కృషిచేస్తానని చేసిన బాసలు ఏమైనాయని ఆరోపించారు. పలు బహిరంగ సభల్లో రెడ్డిల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూన్నమనీ చెప్పారు. నవీన్ వెంటనే ని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పదవినీ అడ్డుపెట్టుకొని రెడ్డిలపై మరోసారి ఇలాంటి వాఖ్యలు చేస్తే తెలంగాణ లో ఎక్కడ తిరుగనియ్యమని హెచ్చరించారు. నవీన్ నీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసునని, చాయకు పైసలు అడిగినోనివి ఈ రోజు వందల కోట్లు ఎలా సంపాదించావో బయటకు వస్తాయన్నారు. తీన్మార్ మల్లన్న మాయలో పడి బిసిలు మోసపోవద్దనీ రెడ్డి సంఘాల నాయకులు సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పై వెంటనే చర్యలు చేపట్టి, పదవి నుంచి బర్తరఫ్ చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు…అలాగే వచ్చే రెండు రోజుల్లో మండలి చైర్మన్ ను కలిసి తీన్మార్ మల్లయ్య అలియాస్ చింతపండు నవీన్ పై పిర్యాదు చేస్తామని మండిపడ్డారు. రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రికులపెల్లి రవీందర్ రెడ్డి, ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ రెడ్డి, ఆర్ బి వి ఆర్ ఆర్ రెడ్డి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి దారం జగన్నాథ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సామా బల్ రెడ్డి, బేతి మహేందర్ రెడ్డి, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, ఎన్. ప్రసన్న కుమార్ రెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, సాగర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జలపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేంకటేశ్వర్ రెడ్డిలు పాల్గొన్నారు
