
ములుగు జిల్లా ప్రతినిధి :
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో గోరక్షకుడు సోను సింగ్ (ప్రశాంత్) ను అతి దారుణంగా తుపాకీతో ఎంఐఎం గూండాలు కాల్పులకు పాల్పడిన ఘటనలో ప్రశాంత్ సింగ్ తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని 163 వ జాతీయ రహదారిపై కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి, అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గోరక్షకుడిపై కాల్పులు జరిపిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, గోరక్షకుడికి ఉన్నత వైద్య సదుపాయాలు కల్పించాలని, రాష్ట్రంలో గోరక్షణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేయడం జరిగింది,గోమాతను రక్షించే గోరక్షకులపై కాల్పులు జరగడం సనాతన ధర్మానికి అవమానం, ప్రజాస్వామ్యానికి అవహేళన. రాష్ట్ర ప్రభుత్వం గోరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. గోరక్షకులను రక్షించాల్సిన బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. నిందితులను వెంటనే అరెస్టు చేసి, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
“బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తుండగా, పోలీసులచే అక్రమంగా అరెస్టు చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధ చర్య. దీనిని బీజేపీ తీవ్రంగాఖండిస్తుందనిఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గానికి తొత్తులుగా మారి, తెలంగాణలో గన్ కల్చర్‌కు ప్రోత్సాహం ఇస్తోందని శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం, ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని కాపాడుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు,” అన్నారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం సాధించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగుతుందని ములుగు జిల్లా బీజేపీ ప్రకటించింది.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ భూక్యా జవహర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీలమంతుల రవింద్రాచారి, జిల్లా ఉపాధ్యక్షులు, భర్తాపురం నరేష్, అల్లే శోభన్, రవి రెడ్డి మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు, ఇమ్మడి రాకేశ్ యాదవ్ యాద సంపత్ , సతీష్ వావిలాల జనార్దన్, రెడ్డి శ్రీనివాస్, కాసర్ల సురేశ్, శ్రీహరి, శ్రీనివాస్, కళ్యాణ్, లాకావత్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.