ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రులకు బాసటగా ఉంటా: అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్, జనవరి 31(భారత శక్తి): రానున్న పట్టవద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానని కరీంనగర్, అదిలాబాద్,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా వి.నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో పలువురు పట్టబద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానిగా నేను ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేశానన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంధాలయాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వం పక్షాన మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. పట్టభద్రుల సంక్షేమానికి , ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక విద్యావేత్తగా నిస్వార్ధంగా సేవ చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు . ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న హెల్త్ కార్డు తో పాటు మినిమం బేసిక్స్ సాలరీ అమలుకు కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యజమాన్యాలు నిధులు విడుదల కాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి ఒక పెద్దన్నలానిధుల విడుదలకు సహకరిస్తానని వెల్లడించారు.నిరుద్యోగుల సమస్యల నిర్మూలించేందుకు ఒక సదుద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటూ ఉద్యోగ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను అమలు చేసే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు . కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అల్ఫోర్స్ ఆధ్వర్యంలో VNR e-CLASSES ధ్వారా ఆన్ లైన్ లో వీడియో క్లాసెస్ , టెస్ట్ పేపర్లు,స్టడీ మెటీరియల్ ను అందచేయడం జరుగుతుందని ఈ యాప్ ను డౌన్ లోడ్ కోసం క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు .రానున్న రోజుల్లో గ్రంధాలయాల్లో, బీసీ స్టడీ సర్కిల్ లో తన వంతుగా మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిచినా తరువాత నిరుద్యోగ యువత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో VNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఉద్యోగ, నిరుద్యోగ పట్టభద్రులకు బాసటగా ఉంటా: అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

కరీంనగర్, జనవరి 31(భారత శక్తి):
రానున్న పట్టవద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరుకు కృషి చేస్తానని కరీంనగర్, అదిలాబాద్,నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా వి.నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో పలువురు పట్టబద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానిగా నేను ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేశానన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంధాలయాల్లో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల సౌకర్యార్థం ప్రభుత్వం పక్షాన మధ్యాహ్న భోజనం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. పట్టభద్రుల సంక్షేమానికి , ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక విద్యావేత్తగా నిస్వార్ధంగా సేవ చేయడానికి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు . ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న హెల్త్ కార్డు తో పాటు మినిమం బేసిక్స్ సాలరీ అమలుకు కృషి చేస్తానని అన్నారు. ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యజమాన్యాలు నిధులు విడుదల కాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి ఒక పెద్దన్నలానిధుల విడుదలకు సహకరిస్తానని వెల్లడించారు.నిరుద్యోగుల సమస్యల నిర్మూలించేందుకు ఒక సదుద్దేశంతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. నిరుద్యోగ యువతకు అండగా ఉంటూ ఉద్యోగ రూపకల్పనలో భాగస్వామ్యం అవుతూ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ను అమలు చేసే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు . కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అల్ఫోర్స్ ఆధ్వర్యంలో VNR e-CLASSES ధ్వారా ఆన్ లైన్ లో వీడియో క్లాసెస్ , టెస్ట్ పేపర్లు,స్టడీ మెటీరియల్ ను అందచేయడం జరుగుతుందని ఈ యాప్ ను డౌన్ లోడ్ కోసం క్యూ ఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు .రానున్న రోజుల్లో గ్రంధాలయాల్లో, బీసీ స్టడీ సర్కిల్ లో తన వంతుగా మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా గెలిచినా తరువాత నిరుద్యోగ యువత కోసం ప్రతి జిల్లా కేంద్రంలో VNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలిపారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

About The Author