బోసి గ్రామంలో గణేష్ నవరాత్రుల కార్యక్రమం..
గణేష్ పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ఉమ్మడి ఆదిలాబాద్ - నిర్మల్ :

తానూర్ మండలం బోసి గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్బంగా నిర్వహించిన గణేష్ పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. గ్రామస్థులతో కలసి పూజలు నిర్వహించిన కలెక్టర్, సమాజంలో ఐక్యత, సౌహార్దం నెలకొని శాంతి–సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
About The Author
08 Nov 2025
