ప్రభుత్వ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలి..!

ప్రభుత్వ కార్యక్రమాలను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలి..!

కడప, జూలై 23(భారత శక్తి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలను.. జిల్లాలో పారదర్శకంగా అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని జిల్లా.కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో రాంప్ కార్యక్రమం, పి4, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ కార్యక్రమాల అమలు నిర్వహణపై జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జేసీ అదితిసింగ్, డిఆర్వో విశ్వేశ్వర నాయుడు లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More రాజకీయాలకతీతంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

ఈ సందర్భంగా జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. MSME లను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికంగా జిల్లాను అభివూది చేయడం కోసం రాంప్ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించే లక్ష్యంలో భాగంగా జిల్లాలో ఇప్పటికే బంగారు కుటుంబాలను ప్రాథమికంగా సర్వే, గ్రామసభలు ద్వారా గుర్తించడం జరిగిందన్నారు.  

Read More ప్రభుత్వ నిబంధన ప్రకారమే ఇసుక రవాణా 

రాంప్ (RAMP) కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలో MSME ల పనితీరును పెంచడం మరియు వేగవంతం చేయడం (RAMP) రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రెన్యూర్లను సాంకేతికంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ కూడా ప్రభుత్వ రంగానికి ఆర్థిక మద్దతునిస్తోందన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఉద్యం వర్క్‌షాప్‌లను నిర్వహించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టాలన్నారు. అందుకు గాను అన్ని మండలాల్లో MSME సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు. అందుకు అవసరమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ESDP), ఎంపానెల్మెంట్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ (BDS) ప్రొవైడర్లను భాగస్వామ్యం చేయడం జరుగుతోందన్నారు. 

Read More  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు 

పి4 ఫౌండేషన్ అమలులో భాగంగా..రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు మేరకు జిల్లాలో ఇప్ప‌టికే జిల్లాలో 78 వేల బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందని, దాదాపు 10 వేల మందిని ఎంపిక చేసిన మార్గదర్శుల ద్వారా అడాప్ట్ చేసుకోవడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర జీరో ప్రావర్టీ - పి 4 (పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్) ద్వారా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల జాబితాను మ‌రోసారి పునః పరిశీలన చేసి, మార్పులు చేర్పుల‌తో తుది జాబితాను త‌యారు చేయ‌డం జరుగుతోందన్నారు. దీనికోసం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాలు, వార్డుల్లో జులై 17 నుండి ఆగస్టు 5 లోపల గ్రామ‌స‌భ‌ల‌ను నిర్వ‌హించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు 10 నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. బంగారు కుటుంబాల‌ను ఆర్థికంగానే కాకుండా చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శులు తోడ్పాటును అందిస్తారని తెలిపారు. 

Read More వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు..సంబంధించి రాష్ట్రానికే ఆదర్శంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ మెయిన్ స్కూలులో పైలెట్ ప్రాజెక్టుగా.. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కిచెన్ హాలు నుండి ఈ విద్య సంవత్సరం ప్రారంభం నుండే.. పలు పాఠశాలలకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం సరఫరా జరుగుతోందన్నారు. ప్రతి మండలంలోను ఇలాంటి ఒకే సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

Read More వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్

మండలంలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలో స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసేందుకు అక్కడి సదుపాయాలను, అనుకూలతలను పరిశీలించి మండలానికి ఒక స్మార్ట్ కిచెన్ లను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేకధికారులు, ఎపిడివోలు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అదనంగా మండలంలో మరొక స్మార్ట్ కిచెన్ ను కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా అన్ని మండలాల్లో కిచెన్ ఏర్పాటు, ఫుడ్ సరఫరా సమయం, శుచీ శుభ్రత కు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

Read More వరలక్ష్మీ వ్రత వేడుకలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం..

ఈ కార్యక్రమంలో కేఎంసి కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, చంద్రమోహన్, సీపీవో హజరతయ్య, డిఆర్డీఏ, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం చాంద్ బాషా, డిపిఓ ఏవో ఖాదర్ బాషా, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలి-

About The Author