
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలం నుండి ర్యాలీగా ఎల్లారెడ్డి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేశారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పెద్ద ఎడ్ల నర్సింలు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి, ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో భారతీయ జనతా పార్టీ చెందిన పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఐడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించాలన్న దానిపై ప్రజలకు వివరించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఏటా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహిస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టంబరు 17వ తేదీని విలీనం దినంగా నిర్వహించేది. అయితే బీజేపీ మాత్రం విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని నిర్ణయించింది.1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అయింది. విలీనం అయిన సెప్టెంబర్ దినోత్సవాన్ని విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1947 ఆగస్టు పదిహేనో తేదీన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం భారత యూనియన్ లో విలీనం కావడానికి పదమూడు నెలల సమయం పట్టింది. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించారని బీజేపీ గుర్తు చేస్తూ ఏటా సెప్టంబరు 17న విమోచన దినోత్సవంగా నిర్వహిస్తుంది, అని అన్నారు. ఈ కార్యక్రమంలో, నీలం చిన్న రాజులు, రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, మర్రి బాలకిషన్, బాపురెడ్డి, బత్తిని దేవేందర్, హైమా రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, పట్టణ అధ్యక్షులు అగల్ దివిటి రాజేష్, మండల అధ్యక్షులు పెద్దేడ్ల నర్సింలు, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మాజీ అధ్యక్షులు కుచులకంటి సతీష్, ఎస్.ఎన్ రెడ్డి, సీనియర్ నాయకులు ప్యాలాల రాములు, శ్రీనివాస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత, హారిక, రజిత ప్రధాన కార్యదర్శులు కుచులకంటి, శంకర్, శ్రీను, పంతుల మహేందర్, జక్కుల అశోక్ ఉపాధ్యక్షులు వంగపల్లి కాశీనాథ్, అల్లం పండరి, సాయిలు, కార్యదర్శి బంజపల్లి శివ, మామిడి రమేష్, జనుముల, పోచయ్య కోశాధికారి గజానంద్ యువ నాయకులు హరికృష్ణ, జంగశివ వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.