పంచాయితీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 13:నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ, ఆర్ ఓ, ఏ ఆర్ని ఓ ల విధులు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్ లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం మొదలుకొని, ఎన్నికల లెక్కింపు వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అన్ని రకాల ఫారములను జాగ్రత్తగా పూరించాలన్నారు. రోజువారిగా ఎన్ని నామినేషన్ల వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డు నందు అందుబాటులో ఉంచాలన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, అనర్హమైన నామినేషన్లను తొలగించాలన్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేయవచ్చును అన్నారు. నామినేషన్ల చివరి రోజు నాటికి ఏదేని ఒక నామినేషన్ కు మాత్రమే కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ నామినేషన్లు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తికి తిరస్కరణ పై అపీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. ఎన్నికలకు 44 గంటల ముందు నుంచి ప్రచారానికి అనుమతి ఉండదన్నారు. ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ తనిఖీ, సీల్ వేయుట, తదితర ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. ఓటర్లు తమ వెంట ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని, గుర్తింపు కార్డు యొక్క చివరి 4 అంకెలు సంబంధిత ఫారంలో నమోదు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లుబాటు కానీ ఓట్ల గుర్తింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, డిపిఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ లు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

పంచాయితీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 13:నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ, ఆర్ ఓ, ఏ ఆర్ని ఓ ల విధులు తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్ లు ఎన్నికల నిర్వహణ, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం మొదలుకొని, ఎన్నికల లెక్కింపు వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అన్ని రకాల ఫారములను జాగ్రత్తగా పూరించాలన్నారు. రోజువారిగా ఎన్ని నామినేషన్ల వివరాలను గ్రామపంచాయతీ కార్యాలయ నోటీసు బోర్డు నందు అందుబాటులో ఉంచాలన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, అనర్హమైన నామినేషన్లను తొలగించాలన్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేయవచ్చును అన్నారు. నామినేషన్ల చివరి రోజు నాటికి ఏదేని ఒక నామినేషన్ కు మాత్రమే కట్టుబడి ఉండాలన్నారు. ఒకవేళ నామినేషన్లు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తికి తిరస్కరణ పై అపీలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్నారు. ఎన్నికలకు 44 గంటల ముందు నుంచి ప్రచారానికి అనుమతి ఉండదన్నారు.

ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ తనిఖీ, సీల్ వేయుట, తదితర ప్రక్రియలను పూర్తి చేయాలన్నారు. ఓటర్లు తమ వెంట ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదేని ఒక గుర్తింపు కార్డును తీసుకురావాలని, గుర్తింపు కార్డు యొక్క చివరి 4 అంకెలు సంబంధిత ఫారంలో నమోదు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో చెల్లుబాటు కానీ ఓట్ల గుర్తింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్ లు, డిపిఓ శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్ లు, రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About The Author