విద్యార్థుల అభ్యాసన స్థాయిలో నాణ్యత పరమైన పురోగతి సాధించాలి: జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల అభ్యాసన స్థాయిలలో నాణ్యత పరమైన పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, విద్యా శాఖ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రైవేట్ కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్య అందుతుందన్న నమ్మకం తల్లిదండ్రులకు కల్పించాల్సిన బాధ్యత పాఠశాల ప్రధానోపాధ్యాయులపై ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బోధన పద్ధతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పిల్లలకు పాఠ్యాంశం సులభంగా అర్థమయ్యేలా బోధన జరగాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, సబ్జెక్టు బోధించే అంశంలో ఉపాధ్యాయుల దగ్గర ఏవైనా లోపాలు ఉన్నాయా గమనించి అవసరమైన సలహాలను టీచర్లకు హెడ్ మాస్టర్ లు సూచించాలన్నారు. మార్కులపై మాత్రమే కాకుండా పిల్లలకు ఎంత వరకు అర్థం అవుతుంది, చివరి బెంచ్ విద్యార్థికి కూడా సబ్జెక్టుపై ఆసక్తి కల్గించేలా చేయాలని, టీచర్లకు అవసరమైన గైడెన్స్, శిక్షణ అందించాలని అన్నారు. పాఠశాల తరగతి గదిలో పిల్లలతో ఇంటరాక్షన్ ఎక్కువ జరగాలని, పిల్లల ఏకాగ్రత పెంచేలా బోధన చేయాలని అన్నారు. కొంత వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడాలని అన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టేలా తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పౌష్టికాహారం మాత్రమే తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి అర్హతకు 10వ తరగతి మార్కులే ప్రధానమని, ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు 10వ తరగతి మార్కులను చూస్తారే గాని ధనిక, పేద వర్గాలని చూడరని అన్నారు. మనమంతా ధృడ సంకల్పంతో, పట్టుదలతో పనిచేస్తే మన పాఠశాల స్థాయి మరింత ఉన్నతంగా మారుతుందని, తద్వారా రాబోయే తరం నాణ్యమైన సమాజాన్ని నిర్మిస్తుందని అన్నారు. ప్రభుత్వ విద్యారంగం వైభవానికి మనమంతా కలిసి పని చేయాలని, ఓకే రోజు అద్భుతమైన మార్పు సాధ్యం కాకపోయినా పాజిటివ్ డైరెక్షన్ వైపు మనం పని చేయడం ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వ విద్యలో అద్భుతమైన మార్పులు వస్తాయని, విద్యతో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని కలెక్టర్ తెలిపారు. అమ్మా, నాన్నలతో పాటు పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించే అవకాశం గురువుకి దొరుకుతుందని, విద్యార్థులు మంచి విద్యను అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చేలా పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఉపాధ్యాయులు పిల్లల కోసం పని చేస్తున్నా మన్న బాధ్యతను దృష్టిలో ఉంచుకోవాలని, ఉపాధ్యాయుడిగా ఎంత మందిని పిల్లలను ప్రయోజకులుగా చేశామనేది ముఖ్యమని, మన వల్ల ఇంత మంది పిల్లలు ప్రయోజకులు అయ్యారంటే మనకు గర్వంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు ఉన్న ఆసక్తులను గమనించి వారిని ఆ రంగాలలో ప్రోత్సహించాలని, పరీక్షలపై విద్యార్థులకు ఉన్న భయాన్ని తొలగించి, నమ్మకంతో సునాయసంగా పరిక్షలు రాసేందుకు కృషి చేయాలని, విద్యార్థుల విద్యా స్థితి గతులను పరీక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు మనవంతు సహాకారం అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పంచసూత్రాలైన ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల, పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తల్లిదండ్రులను సంప్రదించాలని, సరైన కారణాలు తెలుసుకొని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల కొంతమంది ప్రజలకు ఉన్న అపోహలు తొలగించే దిశగా, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం నూతనంగా కల్పిస్తున్న వసతులు, పాఠశాలలో మారుతున్న బోధన పద్ధతులు, వస్తున్న ఫలితాలపై ప్రచారం కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, కల్పించబడ్డ వసతులు, అలాగే మన విద్యార్థులు సాధించిన ఫలితాలు అందరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలిసే లాగా చేయాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరిగే విధంగా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి ), పిబ్రవరి 07:
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల అభ్యాసన స్థాయిలలో నాణ్యత పరమైన పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.
శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, విద్యా శాఖ కార్యక్రమాలపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో పిల్లలకు ఉపాధ్యాయులు ఎలా బోధిస్తున్నారు, సబ్జెక్టు బోధించే అంశంలో ఉపాధ్యాయుల దగ్గర ఏవైనా లోపాలు ఉన్నాయా గమనించి అవసరమైన సలహాలను టీచర్లకు హెడ్ మాస్టర్ లు సూచించాలన్నారు. మార్కులపై మాత్రమే కాకుండా పిల్లలకు ఎంత వరకు అర్థం అవుతుంది, చివరి బెంచ్ విద్యార్థికి కూడా సబ్జెక్టుపై ఆసక్తి కల్గించేలా చేయాలని, టీచర్లకు అవసరమైన గైడెన్స్, శిక్షణ అందించాలని అన్నారు.
రాబోయే 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టేలా తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పని చేయాలని అన్నారు.
పరీక్షల సమయంలో విద్యార్థులు పౌష్టికాహారం మాత్రమే తీసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి అర్హతకు 10వ తరగతి మార్కులే ప్రధానమని, ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు 10వ తరగతి మార్కులను చూస్తారే గాని ధనిక, పేద వర్గాలని చూడరని అన్నారు.
మనమంతా ధృడ సంకల్పంతో, పట్టుదలతో పనిచేస్తే మన పాఠశాల స్థాయి మరింత ఉన్నతంగా మారుతుందని, తద్వారా రాబోయే తరం నాణ్యమైన సమాజాన్ని నిర్మిస్తుందని అన్నారు.
ప్రభుత్వ విద్యారంగం వైభవానికి మనమంతా కలిసి పని చేయాలని, ఓకే రోజు అద్భుతమైన మార్పు సాధ్యం కాకపోయినా పాజిటివ్ డైరెక్షన్ వైపు మనం పని చేయడం ప్రారంభిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వ విద్యలో అద్భుతమైన మార్పులు వస్తాయని, విద్యతో పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని కలెక్టర్ తెలిపారు.
అమ్మా, నాన్నలతో పాటు పిల్లల భవిష్యత్తును మంచి మార్గంలో నడిపించే అవకాశం గురువుకి దొరుకుతుందని, విద్యార్థులు మంచి విద్యను అందించి వారి జీవితాల్లో మార్పు తీసుకొని వచ్చేలా పని చేయాలని కలెక్టర్ సూచించారు.
ఉపాధ్యాయులు పిల్లల కోసం పని చేస్తున్నా మన్న బాధ్యతను దృష్టిలో ఉంచుకోవాలని, ఉపాధ్యాయుడిగా ఎంత మందిని పిల్లలను ప్రయోజకులుగా చేశామనేది ముఖ్యమని, మన వల్ల ఇంత మంది పిల్లలు ప్రయోజకులు అయ్యారంటే మనకు గర్వంగా ఉంటుందని అన్నారు.
విద్యార్థులకు ఉన్న ఆసక్తులను గమనించి వారిని ఆ రంగాలలో ప్రోత్సహించాలని, పరీక్షలపై విద్యార్థులకు ఉన్న భయాన్ని తొలగించి, నమ్మకంతో సునాయసంగా పరిక్షలు రాసేందుకు కృషి చేయాలని,
విద్యార్థుల విద్యా స్థితి గతులను పరీక్షిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు మనవంతు సహాకారం అందించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
ప్రతి ఒక్క ఉపాధ్యాయులు పంచసూత్రాలైన ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల, పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. విద్యార్థుల హాజరు శాతంపై ప్రత్యేక దృష్టి పెట్టి తల్లిదండ్రులను సంప్రదించాలని, సరైన కారణాలు తెలుసుకొని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చే విధంగా చూడాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల పట్ల కొంతమంది ప్రజలకు ఉన్న అపోహలు తొలగించే దిశగా, విద్యా వ్యవస్థలో ప్రభుత్వం నూతనంగా కల్పిస్తున్న వసతులు, పాఠశాలలో మారుతున్న బోధన పద్ధతులు, వస్తున్న ఫలితాలపై ప్రచారం కల్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న స్థితిగతులు, ఉపాధ్యాయులు చేస్తున్న కృషి, కల్పించబడ్డ వసతులు, అలాగే మన విద్యార్థులు సాధించిన ఫలితాలు అందరికి, ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలిసే లాగా చేయాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెరిగే విధంగా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
