
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని సంగారెడ్డి బిఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిందని తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరువాత విడతలో వచ్చే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. గత ప్రభుత్వంలో సైతం రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు.