టౌన్ ప్లానింగ్ విభాగాల్లో టన్నులకొద్దీ అవినీతి..
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
- ఆందోళనకు గురిచేస్తున్న వెలుగులోకి వస్తున్న సంఘటనలు..
- తీవ్రమైన గందరగోళానికి దారితీస్తున్న అధికారుల చరిత్రలు..
- అవినీతి అధికారులను కేవలం బదిలీ చేస్తే సరిపోదు..
- న్యాయ విచారణ జరగాలి.. కఠిన శిక్షలు అమలవ్వాలి..
- ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినా చర్యలు శూన్యం..
- సస్పెండ్ చేయడం మాత్రమే పరిష్కారం కాదు..
- శాశ్వతంగా విధుల నుంచి తప్పించాలి.. జైలు శిక్షలు విధించాలి..
- అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న వారిని ఉపేక్షించకూడదు..
- అక్రమ సంపాదనతో కోట్లకు పడగలెత్తిన వారి ఆస్తులు జప్తు చేయాలి..
- మరో సారి లంచం అనే మాట ఎత్తాలంటే వణికిపోవాలి..
- ప్రభుత్వాలు కఠినంగా ఉంటే ఇన్ని పరిణామాలు జరుగుతాయా..?
- టీపీఓల పాపాల్లో ఉన్నతాధికారులకు సైతం వాటాలు..!
- ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి..
- అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించాలి డిమాండ్ చేస్తున్న " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
జీ.హెచ్.ఎం.సి.లో విధులు నిర్వహిస్తున్న టవన్ ప్లానింగ్ అధికారుల అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. ఎలాంటి భయం, భక్తి లేకుండా.. సిగ్గూ ఎగ్గూ లేకుండా పబ్లిక్ గానే లంచాలు డిమాండ్ చేస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. చిన్న చిన్న పనులకోసం సామాన్యుడు కార్యాలయాలకు వెళితే ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.. ఎవరైనా తెగించి ఎదురుతిరుగుతే ఇక అంతే సంగతులు.. నెలల తరబడి తమ చుట్టూ తిప్పికుంటారు.. చివరికి విసిగిపోయిన జనాలు వారు కోరినంత లంచాలను అప్పో సొప్పో చేసి వారి చేతుల్లో పోస్తున్నారు.. ఇక కొంతమంది ధైర్యంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. జరిగేది ఏమీ ఉండదు.. ఏసీబీ లాంటి సంస్థలకు దొరికిపోయినా కేర్ చెయ్యడం లేదు.. రెండు మూడు నెలలు సస్పెండ్ అవుతారు.. తిరిగి విధుల్లో చేరతారు.. తమ బిజినెస్ ని కంటిన్యూ చేస్తారు.. ఈ సీట్ కాకపోతే మరో సీటు.. ఈ ఏరియా కాకపోతే మరో ఏరియా.. తమ ఫంథా మాత్రం మార్చుకోరు.. కుక్క తోక వంకర అన్నట్టుగా.. ఇలా దొరికిన వారిని కేవలం సస్పెండ్ చేయకుండా విధులనుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలి.. కఠిన శిక్షలు అమలు చేయాలి.. అప్పుడే కొంతైనా మార్పు సంభవం అవుతుంది..
హైదరాబాద్ నగరానికి సంబంధించి పునరుద్ధరణ, అటవీ ప్రాంతాల అభివృద్ధి, భవన నిర్మాణం, వాణిజ్య స్థలాల కల్పన వంటి అన్ని పనులను జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ శాఖ నిర్వర్తిస్తుంది. అయితే, ఈ శాఖలోని అవినీతి సమస్యలు నగర ప్రజలకు నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
ఇక భూసంబంధిత అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. పట్టాలు, ప్లాట్ల మార్పిడి, రిజిస్ట్రేషన్ లకు సంబంధించి కరువుదారుల సహకారం, అధిక ఖర్చుతో భూసంబంధిత మోసాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతించని మార్పులు జరగడం, ప్రాపర్టీ హక్కులు ఉల్లంఘించడం కొనసాగుతోంది. నిర్మాణ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది.. బిల్డింగ్ కోడ్, సరిహద్దులు, పార్కింగ్, ప్రకాశన హరిత ప్రాంతాలు వంటి నిబంధనలు చాలాసార్లు ఉల్లంఘనకు గురి అవుతున్నాయి.. ఇది పర్యావరణ, భద్రతా సమస్యలకు దారి తీస్తుంది.
అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.. పరిమితి నివారణ, నగర అభివృద్ధి ప్రణాళికల కింద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడంతో సాధారణ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది.. ఇక టౌన్ ప్లానింగ్ అధికారుల నివేదికలు, సర్వే డేటా, సొమ్ము లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉండడం సాధారణంగా మారిపోయింది.. ఈ విధంగా అవినీతి పద్దతులు మరింతగా పునరావృతం అవుతున్నాయి. నగరంలో నియంత్రణ లేని అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి.. పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.. మోసపూరిత ప్రాజెక్టులు అడుగడుగునా వెలుస్తున్నాయి.. సాధారణ ప్రజల సమస్యలకు పరిష్కారం అనేది లేకపోవడం ఆందోళన కలిగించే విషయం..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటనలు, అధికారులు, ప్రజలు, మీడియా మధ్య తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.
జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిపై కొన్ని కీలక సంఘటనలు చూద్దాం :
ఏకంగా 27 మంది అధికారులు బదిలీ అయ్యారు.. జూన్ 2025లో, జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్.వి. కర్నన్ 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను అవినీతిపై ఆరోపణలతో బదిలీ చేశారు. ఇందులో 13 అసిస్టెంట్ సిటీ ప్లానర్లు కాగా 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ చర్య ప్రజల ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తీసుకోబడింది
.
నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో రూ. 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ఒక టౌన్ ప్లానింగ్ అధికారి.. సెప్టెంబర్ 2025లో, నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి తెలంగాణ యాంటీ-కారప్షన్ బ్యూరో వారు రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఆమె లే అవుట్ రిజిస్ట్రేషన్ స్కీం అంటే ఎల్.ఆర్.ఎస్. ఫైల్ క్లియరెన్స్ చేయడానికి మొత్తం రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి
.
ఆగస్టు 2025లో, షేక్ పేట్, జూబ్లీహిల్స్‌లోని సూర్య నగర్ కాలనీ నివాసులు జీ.హెచ్.ఎం.సి. సర్కిల్ 18 అధికారులపై అవినీతికి సంబంధించిన ఫిర్యాదు చేశారు. వారు అక్రమంగా 7-8 అంతస్తుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు, అధికారులకు బినామీ ఆస్తులు ఉన్నట్లు ఆరోపించారు
.
మరొకటి టాలీవూడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వ్యాపార పార్క్‌లో అక్రమ నిర్మాణం.. జులై 2025లో, జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ వ్యాపార పార్క్‌లో నాల్గవ అంతస్తు అనధికారికంగా నిర్మించబడినట్లు జీ.హెచ్.ఎం.సి. గుర్తించింది. అల్లు అరవింద్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేయబడింది
.
అవినీతి పెచ్చుమీరడానికి అనేక కారణాలు ఉన్నాయి.. అనధికారిక నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం: అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి, భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించడం తరచుగా జరుగుతోంది..
ఇక ఎల్.ఆర్.ఎస్. వంటి అనుమతుల కోసం లంచాలు డిమాండ్ చేస్తున్నారు.. అవినీతి అధికారులు తమ కుటుంబ సభ్యుల పేర్లపై అక్రమ ఆస్తులు సృష్టించుకుంటున్నారు..
జీ.హెచ్.ఎం.సి. తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి అన్నది చూస్తే.. అవినీతిపై ఆరోపణలతో అధికారులను బదిలీ చేయడం.. సస్పెండ్ చేయడం మాత్రమే జరుగుతోంది.. దీనివలన ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు..
అయితే అనధికారిక నిర్మాణాలను అరికట్టడానికి కొత్త నిబంధనలు అమలు చేయడం లాంటివి చేయాలి.. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలి..
ఇక ఈ వ్యవహారంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది.. ప్రజలు తమ ఫిర్యాదులను ప్రజావాణి లేదా తెలంగాణ యాంటీ కారప్షన్ బ్యూరో ద్వారా నమోదు చేయవచ్చు. అవినీతికి సంబంధించిన సమాచారం కోసం ఏసీబీ వారి టోల్-ఫ్రీ నంబర్ 1064 లేదా వాట్సాప్ నంబర్ 9440446106 ను సంప్రదించవచ్చు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతిని రూపుమాపడానికి " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " పోరాటం సాగిస్తోంది.. మా పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటోంది.. ఆహ్వానిస్తోంది..