భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 31: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బాసరలో పర్యటించిన కలెక్టర్ వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి పుష్కర ఘాట్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కర ఘాట్ ప్రదేశంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. గోదావరి నదిలో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నది వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు కలగకుండా అవసరమైన విద్యుత్ దీపాలను అమర్చాలని సూచించారు. అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వి ఐ పి గెస్ట్ హౌస్ లో అధికారులతో కలిసి వసంత పంచమి వేడుకల నిర్వహణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బాసరలో ఫిబ్రవరి 1 నుండి 3 వరకు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల పర్యవేక్షణకు భైంసా ఆర్డిఓ ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, బయోటాయిలెట్ లను ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు. శిశువులకు పాలిచ్చేందుకు వీలుగా బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి పుష్కర ఘాట్, ఆలయ పరిసరాలన్నీ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంచాలన్నారు. ఆలయం సమీపంలో 108, అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలని అందుబాటులో ఉంచి ఎటువంటి వాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వైద్యులను, అత్యవసర మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి భక్తులు ఆలయానికి సులువుగా చేరుకునే విధంగా రోడ్డు మార్గాన్ని తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో ప్రవేశం, నిష్క్రమణ, త్రాగునీరు, మరుగుదొడ్ల వివరాలు తెలిపే విధంగా సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఆలయాన్ని అందమైన పూలు, లైటింగ్ తో అలంకరించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ డి ఓ కోమల్ రెడ్డి, బాసర దేవాలయ ఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, మిషన్ భగీరథ ఈ సందీప్, తహసిల్దార్ పవన్ చంద్ర, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, దేవాదాయ శాఖల అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, జనవరి 31: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం బాసరలో పర్యటించిన కలెక్టర్ వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా గోదావరి పుష్కర ఘాట్ ను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కర ఘాట్ ప్రదేశంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని సూచించారు. గోదావరి నదిలో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నది వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. రాత్రి వేళల్లో ఇబ్బందులు కలగకుండా అవసరమైన విద్యుత్ దీపాలను అమర్చాలని సూచించారు.
అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని కలెక్టర్ దర్శించుకున్నారు. ఆలయ పూజారులు కలెక్టర్ కు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అనంతరం వి ఐ పి గెస్ట్ హౌస్ లో అధికారులతో కలిసి వసంత పంచమి వేడుకల నిర్వహణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. బాసరలో ఫిబ్రవరి 1 నుండి 3 వరకు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేడుకల పర్యవేక్షణకు భైంసా ఆర్డిఓ ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు. వసంత పంచమికి బాసరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, బయోటాయిలెట్ లను ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగిస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు. శిశువులకు పాలిచ్చేందుకు వీలుగా బేబీ ఫీడింగ్ గదులను ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి పుష్కర ఘాట్, ఆలయ పరిసరాలన్నీ సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంచాలన్నారు. ఆలయం సమీపంలో 108, అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలని అందుబాటులో ఉంచి ఎటువంటి వాంఛనీయ ఘటనలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, వైద్యులను, అత్యవసర మందుల్ని అందుబాటులో ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ ల నుండి భక్తులు ఆలయానికి సులువుగా చేరుకునే విధంగా రోడ్డు మార్గాన్ని తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో ప్రవేశం, నిష్క్రమణ, త్రాగునీరు, మరుగుదొడ్ల వివరాలు తెలిపే విధంగా సూచన బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట బందోబస్తు చేపట్టాలన్నారు. ఆలయాన్ని అందమైన పూలు, లైటింగ్ తో అలంకరించాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ డి ఓ కోమల్ రెడ్డి, బాసర దేవాలయ ఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈఈ అశోక్ కుమార్, మిషన్ భగీరథ ఈ సందీప్, తహసిల్దార్ పవన్ చంద్ర, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, దేవాదాయ శాఖల అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
