స్మార్ట్ సిటీ పేరుతో స్మార్ట్ గా దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ కే దక్కుతుంది, అవినీతి అనకొండ మాజీ మేయరే

కరీంనగర్ : దేశంలో ఎక్కడ లేనివిధంగా కరీంనగర్ లో టాక్స్ విధించి, స్మార్ట్ సిటీ పేరుమీద స్మార్ట్ గా కార్పొరేషన్ లో అందినంత కాడికి దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుకే దక్కుతుందని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ఆరోపించారు.. బుధవారం నగరపాలక కార్యాలయాన్ని, ప్రధాన ద్వారాన్ని కుంభమేళ గంగాజలంతో ఐదెండ్లు పట్టిన శని విరగడయిందనీ వినూత్నంగా చంద్రశేఖర్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శుద్ధి చేశారు. అనంతరం ఒక ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను ఏ పార్టీలో ఉన్న అవినీతిపై పోరాడుతూనే ఉంటానని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పైసలు లేనిదే ఫైలు కదలదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ను అవినీతి కంపుమయంగా తయారు చేసిన అవినీతి పరుడు సునీల్ రావుకే ఆ ఘనత దక్కుతుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతిపై పోరాటం చేయమన్నారని చెప్పారు.

స్మార్ట్ సిటీ పేరుతో స్మార్ట్ గా దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ కే దక్కుతుంది, అవినీతి అనకొండ మాజీ మేయరే

కరీంనగర్ :
దేశంలో ఎక్కడ లేనివిధంగా కరీంనగర్ లో టాక్స్ విధించి, స్మార్ట్ సిటీ పేరుమీద స్మార్ట్ గా కార్పొరేషన్ లో అందినంత కాడికి దోపిడీ చేసిన ఘనత మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుకే దక్కుతుందని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ఆరోపించారు.. బుధవారం నగరపాలక కార్యాలయాన్ని, ప్రధాన ద్వారాన్ని కుంభమేళ గంగాజలంతో ఐదెండ్లు పట్టిన శని విరగడయిందనీ వినూత్నంగా చంద్రశేఖర్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శుద్ధి చేశారు. అనంతరం ఒక ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ
తాను ఏ పార్టీలో ఉన్న అవినీతిపై పోరాడుతూనే ఉంటానని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పైసలు లేనిదే ఫైలు కదలదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ను అవినీతి కంపుమయంగా తయారు చేసిన అవినీతి పరుడు సునీల్ రావుకే ఆ ఘనత దక్కుతుందన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మంత్రి సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతిపై పోరాటం చేయమన్నారని చెప్పారు.

About The Author