పేదోడి కడుపు కొడుతున్న దౌర్భాగ్యం..!

హైదరాబాద్ ( స్పెషల్ కరస్పాండెంట్ ) :

* తెలంగాణలో రేషన్ కార్డుల కుంభకోణం..
* వెలుగులోకి అవినీతి, అక్రమాలు .
* అనర్హులకు విచ్చల విడిగా పంపిణీ..
* పెద్ద ఎత్తున చక్రం తిప్పుతున్న మధ్యవర్తులు..
* మీ ప్రాంతం ఏదైనా.. మీరు ఈ స్థితిలో ఉన్నా..
* డబ్బులు విసిరెయ్యండి.. రేషన్ కార్డులు పట్టుకెళ్లండి..
* నకిలీ ఆధార్, నకిలీ ఓటర్ కార్డుల సృష్టి..
* వీటి సహాయంతో సులువుగా కార్డుల జారీ..
* అర్హులను నిలువునా ముంచుతున్న అవినీతి బకాసురులు..
* రేషన్ కార్డుల మాఫియాపై సమర శంఖం పూరిస్తోంది "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..

WhatsApp Image 2025-08-29 at 3.35.33 PM

పది సంవత్సరాల బీ.ఆర్.ఎస్. ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఉన్న రేషన్ కార్డులను పీకి పడేశారని తీవ్రమైన విమర్శలు చేసిన డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి.. అధికారం చేజిక్కించుకున్న తరువాత డైనమిక్ అనే పదాన్ని భూస్థాపితం చేశాడు.. అనుభవారాహిత్యంతో పరిపాలన సాగిస్తూ.. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నాడు అన్న అపవాదు మూటగట్టుకున్నాడు.. తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్నట్టుగానే కనిపిస్తూ.. ఆ పథకాల్లో అంతులేని అవినీతిని నింపుతున్నాడని విశ్లేషకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.. ఇదివరకే ఇందిరమ్మ ఇండ్ల ప్రసహనం గురించి చెప్పుకున్నాం.. ఇప్పుడు రేషన్ కార్డుల వ్యవహారంలో వెలుగు చూసిన భయంకర నిజాల గురించి మీ ముందుకు తీసుకుని వస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..

Read More ఏరియా హాస్పిటల్ లో అరుదైన చికిత్స


తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ కార్డుల వ్యవస్థలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. అర్హులైన పేదలకు కార్డులు రాకపోగా, అర్హత లేని ధనికులు, నకిలీ వ్యక్తులు రేషన్ కార్డులు పొందుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

Read More వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ ల పంపిణీ

అసలు కుంభకోణం ఎలా జరుగుతోంది?

Read More భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.

రేషన్ కార్డు పొందడానికి మధ్యవర్తులు పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారు. నకిలీ ఆధార్, నకిలీ ఓటర్ కార్డుల ఆధారంగా తప్పుడు రేషన్ కార్డులు తయారు చేస్తున్నారు.

Read More సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే ఉల్లాస్

నిజమైన బీడీలు, రోజువారీ కూలీలు, దినసరి వేతన కార్మికులు రేషన్ కార్డు కోసం నెలల తరబడి తిరిగినా వారికి అవకాశం ఇవ్వడం లేదు.

Read More సెల్యూట్.. నిర్మల్ పోలీస్.

ఒకే కుటుంబానికి రెండు మూడు కార్డులు ఉండగా, పక్కింటివారికి మాత్రం ఒక్కటి కూడా లేకపోవడం సాధారణంగా మారిపోయింది..

Read More నేటి భారతం :

ప్రభుత్వ పెద్దలకు లాభం..పేదలకు తీవ్ర నష్టం :

Read More నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ఈ నకిలీ కార్డుల ద్వారా కోట్ల రూపాయల విలువైన బియ్యం, కిరాణా సరుకులు అక్రమంగా మార్కెట్‌లోకి వెళ్ళిపోతున్నాయి. అక్రమ వ్యాపారులకు, వారి వెనుక ఉన్న రాజకీయ గద్దలకు కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్నాయి..

Read More కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..

పేదల కోసం కేటాయించిన ఆహార ధాన్యం మధ్యలోనే మాయమైపోతుండటంతో నిజమైన బడుగు బలహీన వర్గాలకు సరుకులు అందడం లేదు.

ప్రజల ఆగ్రహం, అసహనం :

రాష్ట్రవ్యాప్తంగా ఈ కుంభకోణంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, నకిలీ కార్డులను వెంటనే రద్దు చేయాలని, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విమర్శకులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు : 

ఇది కేవలం రేషన్ వ్యవస్థలోని అవినీతి మాత్రమే కాదు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం కూడా ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. సమగ్రంగా సర్వే చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోకపోతే పేదల ఆకలి సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కాగా ప్రతి పథకానికీ రేషన్ కార్డు ఉండాలన్నది తప్పనిసరి కావడంతో.. నిజంగా అర్హులైన వారికి తీరని అన్యాయం జరుగుతోంది.. అర్హులను కాదని అనర్హులకు, ప్రభుత్వ పెద్దలకు, పలుకుబడి ఉన్నవాళ్లకు, అధికారుల అనుయాయులకు లబ్ధి చేకూర్చే అక్రమ ప్రక్రియ నిరాటంకంగా సాగుతోంది.. డైనమిక్ అనే పదానికి నిజమైన అర్థాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ" ఆశిస్తోంది..

About The Author