సిద్ధార్థలో ఘనంగా “వసంత పంచమి” వేడుకలు
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): మాఘమాసం శుద్ధ పంచమినీ పురస్కరించుకొని సిద్ధార్థ విద్యాసంస్థల ఛైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం మంకమ్మతోటలోని పాఠశాల ప్రాంగణాన్ని బంతిపూలతో మామిడితోరణాలతో రంగవల్లులతో అందంగా అలంకరించి, ఆవరణలో సరస్వతీదేవిని రత్నసింహాసనంపైన అందంగా అలంకరించారు. విద్యార్థులచే, వేద బ్రాహ్మణులచేత శ్రీ సరస్వతీదేవి పూజ, హోమం శాస్త్రోక్తముగా నిర్వహింపచేసారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డిగారు కుటుంబ సమేతంగా ఈ హోమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారిని బీజమంతములతో, అష్టోత్తరశతనామాలతో అర్చించారు. శ్రీపాల్ రెడ్డి చేతులమీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ అనంతరం శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విద్యలకు అధిదేవతయైన ఆ చదువుల తల్లి అనుగ్రహం విద్యార్థులందరికి ఉండాలని ఆశీర్వదిస్తూ, ఇలాంటి వేడుకలు పాఠశాలలో జరుపుకోవడం ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
మాఘమాసం శుద్ధ పంచమినీ పురస్కరించుకొని సిద్ధార్థ విద్యాసంస్థల ఛైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం మంకమ్మతోటలోని పాఠశాల ప్రాంగణాన్ని బంతిపూలతో మామిడితోరణాలతో రంగవల్లులతో అందంగా అలంకరించి, ఆవరణలో సరస్వతీదేవిని రత్నసింహాసనంపైన అందంగా అలంకరించారు. విద్యార్థులచే, వేద బ్రాహ్మణులచేత శ్రీ సరస్వతీదేవి పూజ, హోమం శాస్త్రోక్తముగా నిర్వహింపచేసారు. పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డిగారు కుటుంబ సమేతంగా ఈ హోమంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు అమ్మవారిని బీజమంతములతో, అష్టోత్తరశతనామాలతో అర్చించారు. శ్రీపాల్ రెడ్డి చేతులమీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ అనంతరం శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్ని విద్యలకు అధిదేవతయైన ఆ చదువుల తల్లి అనుగ్రహం విద్యార్థులందరికి ఉండాలని ఆశీర్వదిస్తూ, ఇలాంటి వేడుకలు పాఠశాలలో జరుపుకోవడం ద్వారా విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
