సింగల్ విండ్ పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
తిరుపతి జిల్లా ప్రతినిధి : తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేది జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్దంగా చేసుకోవాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కృషి చేస్తున్నారని ఆయన చెబుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ తో చేసిన వినియాక విగ్రహాల స్థానంలో మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు.
ఈనెల 31 వ తేది నిమజ్జనం చేయాలని నిర్ణయించినందున ప్రజలంతా ఆ రోజు కేటాయించిన సమయం ప్రకారం మండపాల నుంచి విగ్రహాలను వినాయక సాగర్ కు తరలించాలని ఆయన విజ్జప్తి చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారయంత్రాంగం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వినాయక మండపాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి కాల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పోరేషన్ కమీషనర్ మౌర్య తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఈ కాల్ సెంటర్ కు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు ఉచితంగా ఇస్తామని ఆమె తెలిపారు. గత ఏడాది ఐదు వందల అప్లికేషన్లు వచ్చినట్లు ఆమె చెప్పారు.