సోషలిస్టు రాజ్యాంగం లక్ష్యంగా వ్యా.కా.స.జాతీయ కౌన్సిల్ సమావేశాలు.

పోరుమామిళ్ల :

దేశంలో కార్పొరేట్ల అనుకూల పాలన సాగుతోంది. 
గ్రామీణ ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తున్నారు. 
విద్య, వైద్యం, గృహవసద్ది, ఉపాధి, ఆహారం, అందరికీ అందించాలి. 
సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. 

WhatsApp Image 2025-09-05 at 7.40.08 PM

శుక్రవారం, ఉదయం 10 గంటలకు, జమ్మలమడుగు స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా నందు భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జమ్మలమడుగు, మైలవరం మండలాల కమిటీల విస్తృత సమావేశం సిపిఎం జమ్మలమడుగు మండల కార్యదర్శి జి.దాస్ అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ... అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప జిల్లా కేంద్రంగా, కడప నగరంలో 2025 సెప్టెంబర్ 8, 9, 10, తేదీలలో జరగనున్నాయని తెలిపారు. ఈ జాతీయ కౌన్సి సమావేశాలకు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ ప్రభుత్వ చైర్ పర్సన్ విజయ రాఘవన్ గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు శివదాసన్ గారు, 22 రాష్ట్రాల వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న ఉద్యమకారులైన ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన కడప కొత్త ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి, కోటిరెడ్డి సర్కిల్ మీదుగా పాత బస్టాండ్ వరకు, వ్యవసాయ కార్మికుల "భారీ ప్రదర్శన"  ఉంటుందని, అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్లో "బహిరంగ సభ"  నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సెప్టెంబర్ 9,10, తేదీలలో దేశవ్యాప్తంగా వచ్చిన 200 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల్లో వ్యవసాయ కార్మికులు పడుతున్న కష్టాలు, బాధలు, కుల వివక్షత పై చర్చిస్తారని అన్నారు. దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చి, చిన్న కమతాలను, మధ్యతరగతి మోతుబడి రైతులను కూడా రోడ్డును పడేసే కార్పొరేట్ వ్యవసాయ అనుకూల నాలుగు నల్ల చట్టాలను రైతులు తిప్పి కొట్టిన, నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి ఎన్డీఏ కూటమి తాత్కాలికంగా ఆపి, దొడ్డిదారిన మళ్లీ అమలు చేయటానికి ప్రయత్నిస్తున్న వైనాన్ని, దానికి వ్యతిరేకంగా నిర్వహించాల్సిన ప్రతిఘటన పోరాటాన్ని చర్చిస్తారని అన్నారు. యూపీఏ-వన్ గవర్నమెంట్లో వామపక్షాల ఒత్తిడితో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను తగ్గించి నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక వైఖరిపై చర్చించి పోరాటాలను రూపొందిస్తారని అన్నారు. నేడు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో జీవిస్తున్న నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు విద్యా, వైద్యం, మోయలేని భారంగా మారిందని, ఈ రెండింటిని ఉచితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ అందించాలని, ఈ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమ రూపకల్పనకు కడప నగరం వేదిక కావడం చాలా ఆహ్వానించదగ్గ అంశమని, ఈ సమావేశాలు విజయవంతం కావడానికి సిపిఎం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు. నేడు దేశంలో భారత లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్ రాజ్యాంగాన్ని సోషలిస్ట్ రాజ్యాంగం గా అభివృద్ధి చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం దేశ ప్రజలందరిపై ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్, జి.శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.శివకుమార్, చేనేత ఉత్తిదారుల సంఘం నాయకులు వి.శివనారాయణ, కొండయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు వినయ్, సిఐటియు నాయకులు విజయ్, మున్సిపల్ నాయకులు శేఖరు, నాగన్న , రవి, వివిధ విద్యార్థి, యువజన, కార్మిక, చేతి వృత్తిదారుల సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read More శ్రీ కృష్ణ దేవరాయ నిత్యాన్నదాన ట్రస్టు ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

About The Author