భారత ప్రధాన న్యాయమూర్తి 'సీజేఐ గవాయ్'పై దాడి అమానుషం

ఖమ్మం ప్రతినిది :

WhatsApp Image 2025-10-07 at 7.26.35 PM

భారత ప్రధాన న్యాయమూర్తి సిజెఐ గవాయ్ పై దాడి అమానుషమని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో వారు మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దారుణమైన దాడి అని, న్యాయవ్యవస్థ గౌరవం కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. హింస, బెదిరింపులకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదని, మతోన్మాదం పరాకాష్టకు చేరిందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇలాంటి దాడులపై  ప్రజలు ఏకగ్రీవంగా ఖండించాలని, దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ దాడులకు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

About The Author