ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలి
- చింతా సాయినాథ్
సంగారెడ్డి :
సంగారెడ్డి జిల్లా సదాశివపేట హాట్కర్ పేట్ లో భవసార్ క్షత్రియ సమాజ్ భవాని మందిరంలో అమ్మవారికి అభిషేకాలు,కుంకుమార్చన ,హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు చింత సాయినాథ్ అమ్మవారిని దర్శించుకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక భక్తి కలిగి ఉండాలని వారు అన్నారు.నిర్వాహకులు చింత సాయినాథ్ ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చింత గోపాల్, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, ముద్ద నాగు, శ్రీధర్ రెడ్డి, ఖలీం పటేల్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
18 Oct 2025