మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు

- మాజీ మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి : 

WhatsApp Image 2025-10-06 at 5.15.25 PM

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు  సోమవారం వచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో హరీష్ రావును ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ కార్యకర్తలతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్  హరీష్ రావు కలిశారు.ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను, మాజీ మంత్రి హరీష్ రావు ను పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చం తో సత్కరించారు.

Read More రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి, అధికారులు

సంగారెడ్డి నియోజకవర్గ స్థితి గతులపై చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది.మళ్ళీ బిఆర్ఎస్  ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని హరీష్ రావు తెలిపారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన పార్టీ సిద్ధంగా ఉందని ,  కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావు  పేర్కొన్నారు. 
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More సకాలములో గుండె ఆపరేషన్ నిమిత్తమై "ఓ" పాజిటివ్ రక్తం అందజేత

About The Author