కవికోకిల ఆదికవి వాల్మీకి మహర్షి

 కూజంతం రామరామేతి; 
 మధురం మధురాక్షరమ్। 
 ఆరుహ్య కవితా శాఖాం; 
 వందే వాల్మీకి కోకిలమ్॥

కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని వాల్మీకి అనే కవి కోకిల మధురమూ, మధురాక్షరమూ అయిన 'రామ' నామాన్ని పాడుతోంది. ఇది ఎంతటి సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో కదా!

 

WhatsApp Image 2025-10-06 at 1.07.37 PM

ఈ శ్లోకంలో ఆదికవి వాల్మీకి మహర్షిని కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని రామాయణ పారాయణం చేసిన కవి కోకిలగా వర్ణించారు పండితులు. ఈ శ్లోకంలో కవిత్వమనే పెద్ద చెట్టుకు వాడిన 'ఆరుహ్య' పదం అద్భుతమైనది. రామాయణం దాదాపు లక్షల సంవత్సరాల క్రితం రచించబడిందని సనాతన పండితులు, దార్శనికులు నమ్ముతున్నారు. అయితే వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలికు సమకాలికుడనని వాల్మీకి స్వయంగా పేర్కొన్నాడు. అందుకే శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లోని విషయాలన్నింటినీ పేర్కొన్నట్లుగా తెలుస్తుంది.

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

క్రౌంచజంటపక్షుల శోకంతో ఆవిర్భవించిన శ్లోకం 

Read More బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

భారతీయ వాఙ్మయంలో శ్రీమద్రామాయణము 'ఆదికావ్యం'గా సుప్రసిద్ధమైనది. ఆ మహాకావ్యమును సంస్కృతంలో రచించిన కారణంగా 'ఆదికవి'గా వాల్మీకి మహర్షి కీర్తి గడించాడు. విశ్వవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ ఈ రామాయణ మహాకావ్యం ఎంతో ఆదరణీయమైనది. సర్వజన పూజనీయమైనది. 24 వేల శ్లోకాలతో కూడిన శ్రీమద్రామాయణము సనాతన హిందూ ధర్మానికి పట్టుగొమ్మగా భారతదేశము యొక్క చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకములు ఆచార వ్యవహారములపై అనితరమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఒకనాడు ఒక చెట్టుపైనున్న జంట క్రౌంచ పక్షులలో మగ క్రౌంచ పక్షిని ఒక బోయ బాణంతో చంపి అదే చెట్టు కింద పుల్లలు పేర్చి మంటపెట్టి కాల్చితినబోతాడు. పైనున్న ఆడ క్రౌంచ పక్షి తాను కూడా అదే మంటలో ఆత్మాహుతి చేసుకుంటుంది. ఈ సన్నివేశం అక్కడే ఉన్న వాల్మీకి మహర్షి ని కలచివేస్తుంది. అప్పుడు ఆ క్రౌంచ పక్షుల బలిదానం తో కలిగిన శోకం శ్లోకం గా మారి అనంతరం శ్రీ మద్రామాయణ మహా కావ్యం గా అవతరించింది.  శ్రీమద్రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర కడు రమణీయంగా వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు, రాజులు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు, ఇలా సమాజంలోని అందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తన విధానాలు రామాయణంలో ఎంతో చక్కగా వివరించబడినవి. ఎందరో మహనీయులు రామాయణ మహాకావ్యం లోని పాత్రలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆదర్శ జీవనానికి పరమ ప్రమాణికములుగా స్వీకరించవచ్చని అంగీకరిస్తున్నారు. నేటి మానవాళికి శ్రీమద్రామాయణము నిత్య పఠనీయ గ్రంథమే కాక ఆచరణ కూడా. ముఖ్యంగా భావితరాల వారు శ్రీమద్రామాయణము ను పఠించి ఆచరించవలసిన అవసరము ఎంతైనా కలదు. ఇంతటి మహాకావ్యమును మానవాళికి అందించిన మహాకవి, ఆదికవి, కవి కోకిల వాల్మీకి మహర్షి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన గురించి తెలుసుకోవడం అంటే శ్రీరాముడి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఒక దారి దోపిడీ దారుని బోయవాన్ని గొప్ప కవిగా సంస్కర్తగా తీర్చిదిద్దిన ఘనత పవిత్రమైన 'రామ' నామమునకు దక్కుతుంది.

Read More నేటి భారతం :

భారతీయుల ప్రామాణిక గ్రంథము
శ్రీమద్రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన కారణజన్ముడు వాల్మీకి మహర్షి. ఆయన జీవితం ఎంతో విలక్షణమైనది. మానవాళికి ఆదర్శవంతమైనది. వాల్మీకి తన జీవితకాలంలో పాప పుణ్య కర్మలను ప్రక్షాళన చేసుకున్నాడు. తన రామాయణ మహాకావ్యం ఈ భూమిపై వెలసిన తొలి ఇతిహాస కావ్యమని, మానవుడు రచించిన తొలి గ్రంథమని, చారిత్రక పురుషుడైన, కారణజన్ముడైన, సాక్షాత్తు భగవంతుడైన శ్రీ రామచంద్రుని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా రామాయణ కథనంలో భాగంగా ఆనాటి భౌగోళిక సామాజిక విషయాలను క్రోడీకరించాడు. శ్రీమద్రామాయణమునకు సీతాయాశ్చరితం అని కూడా  పేరు.  అనగా సీతాదేవి యొక్క చరిత్ర అని పేర్కొంటూ సీతారాముల జీవిత గాధను సమగ్రముగా వివరించాడు. దీనితో పాటు సనాతన హైందవ ధర్మానికి చెందినటువంటి ఆచార వ్యవహారములు, చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు మొదలైన వాటి గురించి అనితరమైన తన రచనా ప్రావీణ్యతతో వివరించాడు.

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

ఆ రత్నాకరుడే వాల్మీకి మహర్షి
భారతీయులకు అత్యంత ప్రామాణిక గ్రంథముగా రచించిన శ్రీమద్రామాయణ కర్త వాల్మీకి మహర్షి గొప్ప తపఃశ్శాలి. తన గురించి శ్రీమద్రామాయణము లోని ఉత్తరకాండలో వాల్మీకి తన పూర్వాశ్రమ జీవితం గురించి కానీ తెలియజేశాడు. దాని ప్రకారం వాల్మీకి మహర్షికి ఆయన తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. ఆయన బోయవాడు. తన భార్యా బిడ్డలను పోషించుకొనడానికి గాను అడవిలో వచ్చిపోయే బాటసారిలను బెదిరించి వారి వద్ద ఉన్న సొత్తును దోచుకొని జీవితాన్ని గడిపేవాడు. ఒకనాడు ఆ దారి వెంట వెళుతున్న నారద మహర్షిని కూడా దోచుకోబోగా,  నారదుడు ఆ దొంగను ఆపి నీవు నీ కుటుంబం కోసం చేసే ఈ దారి దోపిడీ ద్వారా వచ్చే సొత్తుతోపాటు పాపాన్ని కూడా మూటగట్టుకుంటున్నావు. సొత్తును అనుభవిస్తున్న నీ భార్యాబిడ్డలను నీ పాపంలో కూడా పాలుపంచుకుంటారేమో ఒకసారి ప్రశ్నించు అని పలుకగా, రత్నాకరుడు సరేనని ఇంటికి వెళ్లి భార్యాబిడ్డలను ప్రశ్నిస్తాడు. అప్పుడు నీవు తెచ్చే సొత్తును పంచుకోవడానికి సిద్ధం కానీ పాపం పంచుకోను అని పలికిన భార్య మాటలను విని, వెళ్లి నారదుడికి వివరిస్తాడు. అప్పుడు నారదుడు "చూశావా! నీవు సంపాదించే సొత్తులో వాళ్లు భాగస్వాములు కానీ తద్వారా వచ్చే పాపంలో వాళ్లు కారు. కనుక నీవు అశాశ్వతమైన నీ సంసారం కోసం శాశ్వతమైన ముక్తిని దూరం చేసుకుంటున్నావు." అని, ఆ రత్నాకరుడికి ఆత్మబోధ చేస్తాడు దానితోపాటు "మరా మరా" అని రామ నామ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. నారదుని ఉపదేశంతో పశ్చాత్తప్తుడైన రత్నాకరుడు క్షమించమని ప్రార్థించి నారదుని ఉపదేశిత తారక మంత్రాన్ని  స్మరిస్తూ ఘోర తపమును చేయగాఎన్నో ఏళ్ళకు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది, వాల్మీకము (పుట్ట) నుండి మరల బయటకు వచ్చినందున (పుట్టినందున) వాల్మీకి మహర్షిగా అవతరిస్తాడు. తపస్సంపన్నత అనంతరం వాల్మీకి మహర్షి ఆశ్రమ వాసం చేయసాగాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీరాముడు సీతను వనవాసానికి పంపినప్పుడు వాల్మీకి ఆశ్రమంలోనే సీతమ్మ "లోకపావని" పేరుతో గడిపినట్లు ఆమె వాల్మీకి ఆశ్రమంలోనే కుశ లవుల కు జన్మనిచ్చినట్లు రామాయణ కావ్యం ద్వారా మనకు తెలుస్తుంది.

Read More శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

యోగ వాశిష్టము, ఆదిత్య హృదయం
'యోగ వాశిష్టము' అనే గ్రంథము వాల్మీకి రచించారు. ఇందులో యోగా, ధ్యానముల గురించి సంపూర్ణముగా వివరించబడినది. ఇది కూడా శ్రీమద్రామాయణము లోని అంతర్భాగమే. శ్రీరాముడు 10, 12 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మానసిక అశాంతికి లోనౌతాడు. మానసిక దౌర్భాగ్యానికి గురై బాధపడుతున్నప్పుడు వశిష్టుడి ద్వారా యోగా ధ్యానములను శ్రీరాముడికి బోధించారు. వ్రాసింది, పలికింది వాల్మీకి మహర్షి. బోధించింది వశిష్ట మహర్షి కనుక యోగ వాశిష్టము అనే పేరు స్థిరపడింది.
ఇక "ఆదిత్య హృదయం" అనేది సూర్య స్తుతిని వ్రాసినవారు వాల్మీక మహర్షి.
 "కౌసల్యా సుప్రజా! రామా! 
 పూర్వా సంధ్యా ప్రవర్తతే। 
 ఉత్తిష్ఠ! నరశార్ధూలా! 
 కర్తవ్యం దైవమాహ్నికం॥" 
అనెడి సుప్రభాతమును వ్రాసిన వారు కూడా వాల్మీకియే.
అవతార పురుషుడు శ్రీరామచంద్రమూర్తి దివ్యగాథను లోకానికి అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి భారతీయులకు నిత్య ప్రాతస్మరణీయుడు. చిరస్మరణీయుడు.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

"సాహిత్య కళా విభూషణ్"
చౌడూరి నరసింహారావు
ప్రవచన కర్తలు, ఆధ్యాత్మిక విశ్లేషకులు 

Read More తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

About The Author