
వాసవి మా ఇల్లు అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఏ జె సి మాధురి, సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని విద్యార్థులు వాసవి మా ఇల్లు సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని వ్యవస్థాపకులు తుపాకీ అనంత కిషన్ ఆధ్వర్యంలో టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ మాధురి ఆవిష్కరించారు. మాతల్లిదండ్రులు కీ, శే: తోపాజి పద్మావతి ఈశ్వరయ్య జ్ఞాపకార్థం సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తోపాజి అనంత కిషన్ తెలిపారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహనీయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బాలికల కళాశాలలో ఏర్పాటుచేసిన తోపాజీ అనంత కిషన్ ధన్యుడు అని అన్నారు. కళాశాలలోని విద్యార్థులు సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడవాలని అన్నారు. మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ అధికారి గోవిందరాం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత,వాసవి మా ఇల్లు కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, సహ కార్యదర్శి తోపాజి హరీష్, యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణు గోపాలకృష్ణ, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వాసవి మహాసంస్థాన్ కోశాధికారి, మల్లేశం, కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చు లింగం, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంఘం, అధ్యక్షుడు, కళింగ కృష్ణ కుమార్, బివిఎం పాఠశాలలా అధినేత, లింగ గౌడ్, శ్రీహరి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.