ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించడం జరిగింది : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 04: తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు పోక్సో చట్టం పై ఒక రోజు ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియమించబడిన ప్రొటెక్షన్ ఆఫీసర్ పాఠశాలలో పిల్లల పట్ల ఎటువంటి లైంగిక దాడులకు గురికాకుండా వాటిని ప్రారంభ దశలోనే అణిచివేసే క్రమంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనీ వీటిలో భాగంగా జిల్లాలో ప్రతి స్కూల్ నుండి ఒకసారి ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసి వారికి మరియు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ రోల్ పైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ స్కూల్ కాన్సెప్ట్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి లో ఉన్న అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి యునిసేఫ్ వారి సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోక్సో చట్టం గురించి ఆ చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించడం జరిగింది.పాఠశాలలలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించే పరిజ్ఞానం హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వివిధ రకాల వేధింపుల గురించి వివరించడం జరిగింది. జిల్లాలో సమర్థవంతమైన పాఠశాలలను తయారు చేసే దిశగా ప్రతి పాఠశాలలో సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాల పనితీరును ,అన్ని ప్రదేశాలలో కవరేజ్ ఉండే విధంగా చర్య తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. పోక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి తెలిసి ఉండాలని అన్నారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి. డబ్ల్యూ.సి. మెంబర్ స్వర్ణ లత, యునిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించడం జరిగింది  : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 04: తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాల నుండి ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ను నియమించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు పోక్సో చట్టం పై ఒక రోజు ఓరియన్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియమించబడిన ప్రొటెక్షన్ ఆఫీసర్ పాఠశాలలో పిల్లల పట్ల ఎటువంటి లైంగిక దాడులకు గురికాకుండా వాటిని ప్రారంభ దశలోనే అణిచివేసే క్రమంలో చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనీ వీటిలో భాగంగా జిల్లాలో ప్రతి స్కూల్ నుండి ఒకసారి ప్రొటెక్షన్ ఆఫీసర్ మరియు హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసి వారికి మరియు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ రోల్ పైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ స్కూల్ కాన్సెప్ట్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొట్టమొదటగా ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కామారెడ్డి లో ఉన్న అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి యునిసేఫ్ వారి సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోక్సో చట్టం గురించి ఆ చట్టంలో నిర్దేశితమైన బాధ్యతల గురించి వివరించడం జరిగింది.పాఠశాలలలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సమర్థవంతంగా పరిష్కరించే పరిజ్ఞానం హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వివిధ రకాల వేధింపుల గురించి వివరించడం జరిగింది. జిల్లాలో సమర్థవంతమైన పాఠశాలలను తయారు చేసే దిశగా ప్రతి పాఠశాలలో సిబ్బందికి చట్టాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాల పనితీరును ,అన్ని ప్రదేశాలలో కవరేజ్ ఉండే విధంగా చర్య తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, విద్యాబోధన ఒకటే కాదని, పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. పోక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. లైంగిక వేధింపులకు గురైన వారు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేవి తెలిసి ఉండాలని అన్నారు. పిల్లల పట్ల లైంగిక దాడులు జరుగకుండా ప్రొటెక్షన్ అధికారి పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం పోస్టర్స్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సి. డబ్ల్యూ.సి. మెంబర్ స్వర్ణ లత, యునిసెఫ్ రిసోర్స్ పర్సన్ డేవిడ్ రాజ్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దయానంద్, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, తదితరులు పాల్గొన్నారు.

About The Author