వధూ వరుల పరిచయ వేదికను విజయవంతం చెయ్యాలి
వేములవాడ :
మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం..
ఆర్మూర్ పట్టణంలో ఈనెల 12న ఆదివారం రోజున జరగబోయే వధూవరుల పరిచయ వేదికను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం పిలుపునిచ్చారు.ఆదివారం వేములవాడ మోచి సంఘం భవనంలో వధూ-వరుల పరిచయ వేదిక కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ముత్యం మాట్లాడుతూ వధూవరుల పరిచయ వేదిక మన కుల ఐక్యతకు ప్రతీక, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో పాల్గొని, యువతీ యువకుల భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడాలి అన్నారు. మోచి సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్క మోచీలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వధువులు తక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో ఈ పరిచయ వేదిక ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్య అభ్యాసం,సామాజిక పురోగతితోనే కుల అభివృద్ధి సాధ్యమని ముత్యం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆర్థికంగా,విద్యా పరంగా ముందుకుసాగి, ప్రభుత్వ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. విద్యతోనే ప్రతి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కల్పించే రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మోచి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిక్షపతి, బాలయ్య, చిన్న బాలయ్య, గోపి,నాయకులు ముఖేష్,రాజేశం, శ్రీనివాస్, మహేష్, శ్యామ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.