రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం

సంగారెడ్డి :

WhatsApp Image 2025-10-04 at 6.45.51 PM

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్రతి గ్రామానికి వచ్చిన రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడమే తమ లక్ష్యమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల మండల కేంద్రంలోని సిజిఆర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలం మరింతగా పెరగాలని, ప్రతి కార్యకర్త గెలుపు లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల ప్రకారం ఎంపికైన అభ్యర్థి గెలుపు సాధించేందుకు సమష్టిగా కృషి చేస్తామని, గ్రామ స్థాయి నుండి పార్టీ శక్తిని మరింత బలపరుస్తామని స్పష్టం చేశారు.

Read More జిల్లా రిజిస్ట్రార్‌ గా శగుఫ్తా ఫిర్దోస్

About The Author