ముదిగొండ, బోనకల్, చింతకాని పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం
ఖమ్మం ప్రతినిది :

శిక్షల శాతం మరింత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలతో కేసుల దర్యాప్తు చేపట్టాలని పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు.
అక్రమ రవాణా, దందాలు, అసాంఘిక కార్యకాలాపాలపై కఠినంగా వ్యవహారించాలి ఆదేశించారు.నేరాల నియంత్రణలో మరింత చిత్తశుద్ధితో పనిచేస్తూ ప్రజల మనసులు చూరగొనాలని అన్నారు. ప్రజలకు ధైర్యం కల్పించేందుకు విజిబుల్ పోలీసింగ్ ను అనుసరించాలంటూ దాని ప్రాధాన్యాన్ని వివరించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ల పనితీరును అంచనా వేసేందుకు నేర సమీక్ష సమావేశాలు డివిజన్ పోలీస్ అధికారులు నిర్వహించాలని సూచించారు.పోలీస్ అధికారుల పోలీస్ స్టేషన్లను క్రమం తప్పకుండా సందర్శించి, పనితీరును సమీక్షించి, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని, అదేవిధంగా, నేర పరిశోధనలు మరియు అరెస్టులలో సహాయపడే సిసిటివి కెమెరాలతో సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు.
డిజిటల్ యుగంలో పెరుగుతున్న సైబర్ నేరాల ధోరణిని ఎదుర్కోవడానికి, అవగాహన, నివారణను పటిష్టమైన సాంకేతిక చర్యలను అమలు చేయాలని అధికారులను కోరారు. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, పెట్రోలింగ్‌ను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాల వ్యసనం, నేర కార్యకలాపాలకు బలైపోకుండా నిరోధించడానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో ప్రశాంత వాతావరణం ఉండేలా సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు ముందస్తు, సమాచారం, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రజా భద్రతను పెంపొందించే ప్రయత్నంలో, చోరీ కేసుల్లో నిందుతులను అరెస్టు చేయడం, అలవాటు పడిన నేరస్థులను ట్రాక్ చేయడం మరియు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు అందించే యూరియా పంపింణి సమయంలో సమస్యలు తల్లెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సమావేశంలో సిసిఆర్బి ఇన్స్పెక్టర్ స్వామి, మురళి, ఎస్సై లు పాలొన్నారు.
