అంబేద్కర్ సచివాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్షా

WhatsApp Image 2025-10-22 at 6.27.13 PM

ములుగు జిల్లా ప్రతినిధి : 

Read More నేటి భారతం :

మేడారం మహాజాతర ఏర్పాట్లపై  తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకి గిరిజన సంక్షేమ శాఖ రూ. 150 కోట్లు మంజూరు చేయగా అందులో రూ. 90 కోట్లు సివిల్ వర్క్స్ కు, రూ. 60 నాన్ సివిల్ వర్క్స్ కు మంజూరు చేశారు.  సివిల్ వర్క్స్ స్టేటస్, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్ మీద సమీక్ష  నిర్వహించి సబ్యసాచి ఘోష్ ములుగు జిల్లా కలెక్టర్  దివాకర టి.ఎస్.తో కలిసి మాట్లాడారు.
మేడారం జాతర ఏర్పాట్లను మొత్తం 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్–3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించి,జాతర సమయంలో 10 నుండి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి జోన్‌కు ఒక జోనల్ అధికారిని నియమించ నున్నట్లు తెలిపారు.

Read More రసాయన శాస్త్రంలో పనస మహేష్ కు పీహెచ్డీ

24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వై-ఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
కోర్ రూట్లు  పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 49 పార్కింగ్ ప్రదేశాలు (వెయ్యి 50 ఎకరాలు) గుర్తించబడి, దాదాపు 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించబడుతుందని, ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని తెలిపారు.

Read More నాగారం గ్రామ సర్పంచిగా చందరాజు లావణ్య సంతోష్ నామినేషన్ దాఖలు

అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుండి డబుల్ లేన్) రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో భాగంగా వైల్డ్‌
లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డాయి.

Read More బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్ & బీ శాఖ ద్వారా 42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు,  92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మించబడుతున్నాయి. జాతర సమయానికి ముందు, మధ్య మరియు తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక జాతర సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి.

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.

Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులు విద్యుత్ శాఖ చేపట్టింది. జాతర ప్రాంతమంతా ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశ ఏర్పాట్లు (ఇల్యూమినేషన్) చేయనున్నారు.

Read More జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం !

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్యసాచి ఘోష్ ఆదేశించారు.

Read More నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్

ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఎలక్ట్రిసిటీ CMD వరుణ్ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక, ఇతర సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమ తమ ఇన్పుట్ అందించారు.

Read More జాతీయస్థాయి కళాకారులకు సన్మానం

About The Author