ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలి
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా గురువారం తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవ పూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్ పాత్ లు, స్పీడ్ బ్రేకర్స్, నో ఎంట్రీ, వన్ వే నీ గురించి వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను బ్యాచ్ ల వారీగా ఈ పార్కు కు తీసుకొచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉచితంగా ఇక్కడకు తీసుకురావాలన్నారు. దీంతో రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులకు తెలుస్తుందన్నారు. ఈ పార్కులో మరిన్ని సౌకర్యాలు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అక్కడికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన పార్కులో తెలుసుకున్న విషయాలను ఆచరించాలన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాధాన్యతను ఇళ్లకు వెళ్లి తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా మండలాల్లోని ప్రతి పాఠశాల విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం అన్ని పాఠశాలల విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పాఠశాల నుంచి బస్సులో తీసుకొచ్చి.. మళ్లీ బస్సులో నే వారి పాఠశాల వద్ద దించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం, డీటీఓ చక్రవర్తి శ్రీకాంత్, డీఈఓ జనార్దన్ రావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అశోక్, ఎంవీఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్, జనవరి 30(భారత శక్తి):
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా గురువారం తిమ్మాపూర్ లోని ఆర్టీఏ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా చొక్కారావు పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు విద్యార్థులకు అనుభవ పూర్వక శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్, ఫుట్ పాత్ లు, స్పీడ్ బ్రేకర్స్, నో ఎంట్రీ, వన్ వే నీ గురించి వివరించే చిత్రాలు ఏర్పాటు చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు.
జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులను బ్యాచ్ ల వారీగా ఈ పార్కు కు తీసుకొచ్చి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నుంచి నామమాత్రపు ఫీజు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉచితంగా ఇక్కడకు తీసుకురావాలన్నారు.
దీంతో రోడ్డుపై ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో విద్యార్థులకు తెలుస్తుందన్నారు.
ఈ పార్కులో మరిన్ని సౌకర్యాలు కల్పించి అధునాతనంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అక్కడికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన పార్కులో తెలుసుకున్న విషయాలను ఆచరించాలన్నారు.
హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాధాన్యతను ఇళ్లకు వెళ్లి తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు.
ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా మండలాల్లోని ప్రతి పాఠశాల విద్యార్థులను ఇక్కడకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డీఈఓకు సూచించారు.
అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం అన్ని పాఠశాలల విద్యార్థులను ఇక్కడకు తీసుకొస్తే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
పాఠశాల నుంచి బస్సులో తీసుకొచ్చి.. మళ్లీ బస్సులో నే వారి పాఠశాల వద్ద దించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం, డీటీఓ చక్రవర్తి శ్రీకాంత్, డీఈఓ జనార్దన్ రావు, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ అశోక్, ఎంవీఐ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
