ఎంబిబిఎస్ లో సీటు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించిన బీసీ సంక్షేమ సంఘం
సంగారెడ్డి :
సంగారెడ్డిలో గల వైయస్సార్ భవన్ లోని సంగారెడ్డి జిల్లాబీసీ సంక్షేమ సంఘం తరపున ఎంబిబిఎస్ ప్రవేశ పరీక్షలు విజయం సాధించిన జంగం ధీరజ్ స్వామి, మఠం బిల్వ శ్రేష్ట, పట్లోళ్ల సుదీప, చల్మెడ మహాదేవ్ పడిశెట్టి శ్రావ్య మడపతి కాత్యాయని, నాయి కోటి కీర్తన లను మెమెంటో శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు ప్రభు గౌడ్ మాట్లాడుతూ డాక్టర్లు సంఘంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తారు అని వైద్య నారాయణ హరి అన్నారని పేర్కొన్నారు. ముఖ్య అతిథు డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ మీరు కాబోయే డాక్టర్లు ఇక్కడికి ఆపకుండా ఎమ్మెస్, ఎండి చేసి మంచి భవిష్యత్తును సాధించగలరని అన్నారు. ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, సలహాదారులు చంద్రయ్య, స్వామి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి మంగ గౌడ్ కార్మిక విభాగ అధ్యక్షుడు సుదర్శన్ యువజన యువజనవిభాగం అధ్యక్షుడు జావీద్ సంగమేశ్వర్ శివ ప్రభు ముఖ్య అతిథులు డాక్టర్ మల్లికార్జున ఎన్ శివకుమార్ మహిళా అధ్యక్షురాలు మంజుల గౌడ్ ప్రధాన కార్యదర్శి వీరమణి నిర్మల తదితరులు పాల్గొన్నారు.