కలెక్టరేట్ భవనం పై నుండి పడి వ్యక్తి మృతి
ములుగు జిల్లా ప్రతినిధి :
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయ భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి చెందాడు.
జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లో కూలిపని చేస్తున్న ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన సిరిపెల్లి రాజయ్య (50)కలెక్టరేట్ నూతన భవనం పై ఆదివారం ఇనుప పైపులు మోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలిసిన మృతుని కుటుంబ సభ్యులు బంధువుల తీవ్ర రోదనలకు గురయ్యారు. మృతికి ముగ్గురు కుమారులు భార్య ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారణ నిర్వహిస్తున్నారు.
Read More జిల్లా రిజిస్ట్రార్ గా శగుఫ్తా ఫిర్దోస్
About The Author
18 Oct 2025