ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం కోసం బీజేపీ ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచింది : పార్లమెంటు సభ్యులు, జాతీయ ఓబీసి అధ్యక్షుడు లక్ష్మణ్
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 14: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యక్రమంలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసి అధ్యక్షుడు లక్ష్మణ్ హజారయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డిలో కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ పార్టీ వైపు ఉన్నారని, రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటుని వేయాలన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ప్రధానమంత్రి మోదీ వైపు ఉన్నారన్నారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ సమాజ అభివృద్ధి కోసం తోడ్పటైందన్నారు. మహిళలు స్వశక్తి కావాలని,చట్టసభలో రిజర్వేషన్లను ప్రకటించడం జరిగిందన్నారు.ఉద్యోగులు, ఉపాద్యాయులు, అధ్యాపకులుకి 12 లక్షల వరకు ఆదాయ పన్నును మాఫీ చేసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. విధాన సభలో ప్రశ్నించే గొంతు ఎత్తడానికి బీజేపీ అభ్యర్థులయిన అంజిరెడ్డి, మల్క కొమురయ్యలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఫిబ్రవరి 14: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యక్రమంలో టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి హాజరైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ ఓబీసి అధ్యక్షుడు లక్ష్మణ్ హజారయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామారెడ్డిలో కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారన్నారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ పార్టీ వైపు ఉన్నారని, రాష్ట్ర సమగ్ర ఆభివృద్ధిని ఆలోచించి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొని ఓటుని వేయాలన్నారు. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ప్రధానమంత్రి మోదీ వైపు ఉన్నారన్నారు. మొన్నటి కేంద్ర బడ్జెట్ సమాజ అభివృద్ధి కోసం తోడ్పటైందన్నారు. మహిళలు స్వశక్తి కావాలని,చట్టసభలో రిజర్వేషన్లను ప్రకటించడం జరిగిందన్నారు.ఉద్యోగులు, ఉపాద్యాయులు, అధ్యాపకులుకి 12 లక్షల వరకు ఆదాయ పన్నును మాఫీ చేసిన ఘనత బీజేపీకి ఉందన్నారు. విధాన సభలో ప్రశ్నించే గొంతు ఎత్తడానికి బీజేపీ అభ్యర్థులయిన అంజిరెడ్డి, మల్క కొమురయ్యలను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
