కాలుష్యాన్ని కాపాడుతున్న అవినీతి కోట..

( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )

* లంచాల ముసుగులో జోగుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు..
* ప్రజల ప్రాణాలతో రాక్షస క్రీడ సాగిస్తున్న అధికారులు. 
* ఎన్ని విమర్శలు వస్తున్నా పద్ధతి మార్చుకోని దౌర్భాగ్యం..
* ఈ నేలమీద సామాన్యులు జీవించే హక్కును కాలరాస్తున్న దుర్మార్గం..
* పర్యావరణాన్ని చెరబట్టి కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్న అవినీతి ముష్కరులు..
* గంగలో పోసిన పన్నీరులా మారిపోతున్న పర్యావరణ వేత్తల పోరాటాలు..
* నేలను, నీటిని, గాలిని కూడా కాలుష్య కోరల్లో బంధిస్తున్నా చలించని ప్రభుత్వాలు..
* కాలుష్య కాసారంగా మారిపోతున్న యావత్ తెలంగాణా భూభాగం..
* ఒళ్ళు గగుర్పొడిచే అంశాలను వెలుగులోకి తీసుకుని వస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"

WhatsApp Image 2025-09-04 at 3.24.37 PM

మనిషి మనుగడలో ప్రధాన పాత్రను పోషించేది ప్రకృతి... గాలి, నీరు, భూమి ఈ మూడూ ప్రకృతిలో భాగమే.. ఈ మూడూ సమతుల్యంగా.. కాలుష్యం లేకుండా ఉన్నప్పుడే మానవజాతి క్షేమంగా, ఆరోగ్యంగా జీవించగలుగుతుంది.. పూర్వాశ్రమంలో ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఒక దేవతలా ఆరాధించేవారు.. కాపాడుకునే వారు.. కానీ కాలగమనంలో ప్రకృతి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది.. కాలుష్యాన్ని వెదజల్లే కెమికల్ అంటే రసాయన కర్మాగారాలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా వేలసంఖ్యలో వెలిశాయి.. ఈ కంపెనీలను పర్యవేక్షించి, గాడిలోపెట్టి, సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద వుంటుంది.. ఇది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది.. నిష్ణాతులైన ఉద్యోగులు ఇందులో బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు..కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అవినీతి కాలుష్యంలో మునిగిపోయింది.. దీంతో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పర్యావరణ సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...

Read More 10న స్థానిక సంస్థల తుది ఓటరు జాబితా.


హైదరాబాద్ నగరాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? కాలుష్యం నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? – పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది.. కానీ ఈ బోర్డు కాలుష్యాన్ని నియంత్రించడం మానేసి, కాలుష్యాన్ని కాపాడే అవినీతి కోటగా మారిపోయిందని ప్రజలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలుగ్గా తీసుకోదగిన విషయం కాదు.. 

Read More కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15 న నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలి..

పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలి. కానీ లంచం తీసుకున్న వెంటనే రిపోర్టులు "క్లీన్"గా మారిపోతున్నాయి. ఫ్యాక్టరీలు నదులలో విషజలాలు పారబోసినా, గాల్లో విష వాయువులు వెదజల్లినా, పీసీబీ అధికారుల కళ్లకు కట్టిన నోట్ల కట్టల గోడలు వాటిని కనిపించకుండా చేస్తున్నాయి. ప్రజల ఫిర్యాదులు ఫైల్ కట్టలలో మాయం అవుతున్నాయి.

Read More రాపర్తి నగర్లో ఘనంగా జరిగిన కుంకుమ పూజ..

ఇది కేవలం అవినీతి కాదు.. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణ భవిష్యత్తును బలితీసుకునే సామూహిక నేరం. 

Read More మహనీయుడు తూము ప్రకాశరావు ఆశయాలను కొనసాగిద్దాం

మూసీ నది విషమయ నదిగా మారడం, హుస్సేన్ సాగర్‌లో నురుగుల విషాన్ని కక్కడం, నగర గాలిలో విషతుల్యాలు పెరగడం.. ఇవన్నీ ప్రత్యక్షంగా అవినీతి అనే జాడ్యం నుంచి పుట్టుకొస్తున్నాయి.. ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే రోజులు వస్తున్నాయి.

Read More బిసీలకు రిజర్వేషన్ అమలుపట్ల హర్షం..

ప్రభుత్వం ఈ అవినీతి వలయంలో కూరుకుపోయిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, "పచ్చని హైదరాబాద్" అనే నినాదం కేవలం ప్రచార పుస్తకాలకే పరిమితం అవుతుంది. కాలుష్య నియంత్రణ బోర్డు నిజంగా కాలుష్యాన్ని నియంత్రించాలంటే..అన్ని అనుమతులు, రిపోర్టులు పూర్తిగా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉండాలి.

Read More స్వరాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి కాళోజి

స్వతంత్ర పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటుచేయాలి.

Read More అధిక వర్షాలతో దెబ్బతిన్న జనగాంమర్రి, మాందాపూర్ రోడ్ పునరుద్ధరణ

అవినీతి చేస్తూ పట్టుబడిన అధికారులను తక్షణమే తొలగించాలి.

Read More స్మార్ట్‌ఫోన్ రక్కసికి బలైపోతున్న యువత..

లేకపోతే హైదరాబాద్ పర్యావరణం శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటుంది. అధికారుల అవినీతికి ప్రజల ఊపిరి బలైపోవడం క్షమించరాని నేరం..

Read More నేటి భారతం :

ఒకప్పుడు "పచ్చని ముత్యాల నగరం"గా పేరు గాంచిన ఈ మహానగరం, ఈ రోజుల్లో గాలికి ఊపిరాడని స్థితికి చేరుకుంది. ఆకాశాన్ని తాకే భవనాలు, రాత్రింబవళ్ళు ఉక్కిరిబిక్కిరి చేసే ట్రాఫిక్, నిరంతరం ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలు.. ఇవన్నీ కలిపి నగరాన్ని నెమ్మదిగా విషపూరితం చేస్తున్నాయి. ఈ కాలుష్యాన్ని నియంత్రించాల్సిన ప్రధాన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషమేమిటంటే, ఈ బోర్డు స్వయంగా అవినీతి కర్కోటకంలో చిక్కుకొని, ప్రజల ఆరోగ్యాన్ని బలితీసుకుంటోంది.

Read More కాళోజీ ఆశయాలను కొనసాగించాలి

కాలుష్యం నియంత్రణ అనే పవిత్ర కర్తవ్యాన్ని పక్కన పెట్టి, అధికారుల గదుల్లో "డబ్బు చలామణి" ప్రధాన పాత్ర పోషిస్తోంది. పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రతి దశలో లంచాలు సర్వసాధారణం. కాలుష్యాన్ని కొలిచే ల్యాబ్ రిపోర్టులు సత్యాన్ని ప్రతిబింబించాలి, కానీ వాస్తవానికి ఇవి లంచాల ప్రతిబింబంగా మారిపోయింది. నిజంగా కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నా "క్లీన్ చిట్" సర్టిఫికెట్ ముద్ర వేయడం బోర్డు సంస్కృతిగా మారింది.

ఈ అవినీతి మూల్యం చెల్లిస్తున్నది ప్రజలే.
గాలి నాణ్యత ప్రతి రోజూ దిగజారిపోతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్  ప్రమాణాలను మించి ఉన్న కాలుష్య సూచికలు నగరవాసుల ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి.

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాస సంబంధిత సమస్యలు, చర్మ రోగాలు, నీటిమూలం వ్యాధులు పెరుగుతున్నాయి. వ్యవసాయ భూములు విషతుల్యం అవుతున్నాయి.. జంతువులు, పక్షులు సైతం బలైపోతున్నాయి..

మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. కాలుష్య సమస్యలపై ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేసినా, అవి ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఫైళ్లపై కట్టిన నోట్ల గడ్డలు అధికారుల కళ్లకు, చెవులకు మూతలు వేస్తున్నాయి. ఒకవేళ నిజమైన తనిఖీలు జరిగితే పరిశ్రమల 70శాతం  మూసేయాల్సి వస్తుందని నిపుణుల వ్యాఖ్య. కానీ అవినీతి వ్యవస్థ వారిని రక్షిస్తోంది.

ఇక్కడ జరిగేది కేవలం అధికారుల లంచగొండి సంస్కృతి కాదు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును బలి తీసుకునే సామూహిక నేరం. రేపటి తరాలు శ్వాస తీసుకోవడానికే ఇబ్బంది పడేలా చేస్తే, ఈ అవినీతికి పాల్పడిన వారు నేరస్థులు కాదా?

ప్రభుత్వం ఈ అవినీతి బోర్డుపై కన్నెర్ర చేయకపోతే, అది కూడా నేరానికి భాగస్వామి అవుతుంది. "పచ్చటి హైదరాబాద్" అనే నినాదం ప్రసంగాల్లో బాగానే వినిపిస్తుంది, కానీ వాస్తవానికి పచ్చదనం కాంక్రీట్ జంగిల్‌లో కనుమరుగైపోతోంది..

కాలుష్యం నియంత్రించాల్సిన బోర్డు స్వయంగా అవినీతికి అడ్డాగా మారితే, నగరం ఊపిరాడని స్థితికి చేరుకోవడం సహజం. ఇప్పుడు మౌనంగా ఉండే సమయం కాదు. ప్రజలు, మీడియా, పౌర సంఘాలు కలసి బలమైన ఒత్తిడి తెచ్చి, అవినీతి అధికారులను బయటకు తీయాలి. లేనిపక్షంలో రేపటి హైదరాబాద్ విష గూళ్లలో చిక్కుకున్న శవాల నగరంగా మారిపోవడం తప్పదు.

ఈ వ్యవహారంపై పోరాటం సాగిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " మాతో చేతులు కలపండి ఆరోగ్య కరమైన, ఆహ్లాదకరమైన, కాలుష్యం లేని రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.. 

About The Author