కాళోజి కళాక్షేత్రం లో చాకలి ఐలమ్మ చరిత్ర నృత్య నాటకం

ఉమ్మడి వరంగల్ బ్యూరో :

WhatsApp Image 2025-09-22 at 6.27.50 PM

హన్మకొండ బాలసముద్రం లోని  కాళోజి కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ప్రారంభమైనవి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రులు  పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జూపల్లి కృష్ణారావు , ధనసరి అనసూయ , కొండా సురేఖ , ఎం.పి కడియం కావ్య , ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ , మేయర్ గుండు సుధారాణి  సహచర ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి పాల్గొన్న  వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన  చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం ఎంతగానో అలరించింది. అకాడమీ ఛైర్ పర్సన్ పుంజాల అలేఖ్య  పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం.ఆనాటి నియంతృత్వ , దోపిడీ, పెత్తందారుల ఆగడాలను  కళాబృందం ఎంతో కళ్లకు కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయం. ఈ సందర్భంగా నృత్య రూపకం  ప్రదర్శించిన కళాకారులను సత్కరించడం జరిగింది...
చారిత్రాత్మక శ్రీ వేయి సంభాల దేవాలయంలో నిర్వహించిన  బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిథి లతో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలలో సాంప్రదాయ బతుకమ్మ పాటలతో మహిళలు ఆడిపాడి ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక, మహిళల ఆత్మగౌరవానికి ప్రతిరూపమని, ఇటువంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు....

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే నాగరాజు  ఆకాంక్షించారు. ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ తొమ్మిది రోజులు ఆట పాటలతో వైభవంగా సాగే బతుకమ్మ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నాగరాజు  గౌరమ్మ తల్లిని ప్రార్థించారు....

Read More సైన్స్ జీవితానికి ఉపయోగపడాలీ

ఈ సందర్భంగా కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి పలు కార్పోరేషన్ ఛైర్మన్లు మహిళమణులు తదితరులు పాల్గొన్నారు....

Read More ఓటరు మహాశయా ఒక్కసారి ఆలోచించు..

About The Author